Humanoid Robot: కొంచెం అందంగా ముఖం.. కొంచెం స్వీట్‌గా వాయిస్‌ ఉంటే చాలు.. కోటిన్నర రూపాయలకు పైగా సంపాదించుకునే ఛాన్స్

by Vennela |

Humanoid Robot: అచ్చం మనిషి వలే కనిపిస్తూ అలాగే ప్రవర్తించే హ్యుమనాయిడ్ రోబోలను రోబో సినిమాలో మనం చూసే ఉంటాం.

Humanoid Robot: కొంచెం అందంగా ముఖం.. కొంచెం స్వీట్‌గా వాయిస్‌ ఉంటే చాలు.. కోటిన్నర రూపాయలకు పైగా సంపాదించుకునే ఛాన్స్
X

దిశ,వెబ్‌డెస్క్: Humanoid Robot: అచ్చం మనిషి వలే కనిపిస్తూ అలాగే ప్రవర్తించే హ్యుమనాయిడ్ రోబోలను రోబో సినిమాలో మనం చూసే ఉంటాం. అలాంటి రోబోలు ఇప్పుడు మన ముఖంతోనూ మార్కెట్లోకి రావచ్చు. అందుకోసం మీకు డబ్బులు కూడా వస్తాయి.

మనిషిలా కనిపిస్తూ అలాగే ప్రవర్తించే హ్యుమనాయిడ్ రోబోలను రోబో సినిమాలో మనం చూశాం. ఇప్పుడు అవే రోబోలు మనం ముఖంతోనూ మార్కెట్లోకి రావొచ్చని మీకు తెలుసా. అంతేకాదు అలా మన ముఖాకృతిని రోబోకు వినియోగించినందుకుగాను ఏకంగా కోటిన్నర రూపాయాల దాకా చెల్లిస్తోంది ఓ సంస్థ. వినడానికి మీకు వింతగా అనిపించినా ఇది నిజం. రష్యన్ రోబోటిక్స్ కంపెనీ కొంతమంది వాలంటీర్ల కోసం సెర్చ్ చేస్తోంది. నిజానికి ఆ కంపెనీ కొన్ని రోబోలను తయారు చేస్తోంది. వాటిపై మానవ ముఖం ఉంచాలని కోరుకుంటోంది. ఒక వ్యక్తి తన ముఖాన్ని రోబోపై ఉపయోగించుకునేందుకు అనుమతి ఇస్తే అతను 1.5కోట్ల వరకు పొందవచ్చని ఆ కంపెనీ చెబుతోంది. ఆ వ్యక్తి తన ముఖాన్ని ఉపయోగించుకునే హక్కులను మాత్రమే ఆ కంపెనీకి ఇవ్వాలి.

దీని ఫలితంగా భవిష్యత్తులో మానవ ముఖాలు కలిగిన రోబోలను మాల్స్, ఎయిర్ పోర్ట్స్, హోటల్స్ వంటి బహిరంగ ప్రదేశాల్లో చూడవచ్చు. కంపెనీ తయారు చేయబోయే హ్యుమనాయిడ్ రోబోట్ అసిస్టెంట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని, ప్రజల సౌలభ్యం కోసం అవసరమైన ప్రదేశాల్లో దీనిని ఏర్పాటు చేస్తామని కంపెనీ చెబుతోంది. అయితే సంస్థకు వచ్చిన ఫొటోను ఎంపిక చేసి ఆ ఆకృతిని వీళ్లు తయారు చేసే రోబోలకు ఉపయోగిస్తారు. దీనికి మన ముఖానికి సంబంధించిన సర్వహక్కులు ఇచ్చినందుకు పెద్దమొత్తాన్ని ముట్టజెబుతారన్నమాట. ఇలాంటి సంస్థలు మరిన్ని పుడితే మనకూ ఓ కవల రోబో తమ్ముడూ చెల్లెలూ రాబోతున్నట్టే.

Next Story