Not a Joke : జోక్ అనుకునేరు.. నిజంగా నిజం..! ఆలుగడ్డ.. టమాటోకు పుట్టిన బిడ్డ..!!

by Javid Pasha |   (  Updated:2025-08-12 09:05:45  IST  )

Not a Joke : జోక్ అనుకునేరు.. నిజంగా నిజం..! ఆలుగడ్డ.. టమాటోకు పుట్టిన బిడ్డ..!!

Not a Joke : జోక్ అనుకునేరు.. నిజంగా నిజం..! ఆలుగడ్డ.. టమాటోకు పుట్టిన బిడ్డ..!!
X

దిశ, ఫీచర్స్ : ఇగో.. ఇది విని జోక్ అనుకునేరు..! అస్సలు కాదు. నిజంగా నిజం ఏంటంటే.. ఎర్రగా బుర్రగా ఉండే టమాట(Tomato)కు, తెల్లగా పొట్టిగా ఉండే ఒక సంతానం కూడా ఉందని పరిశోధకులు తేల్చారు. ఇంతకీ ఎవరా సంతానం? అనే కదా మీ డౌడానుమానం..! మరెవరో కాదు ఆలుగడ్డ.. అదేనండీ కొందరు ‘బంగాళ దుంప’ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ‘Potato’ అన్నమాట. అన్నమాటే కాదు ఉన్నమాట ఏంటంటే.. ‘Tomato is the mother of potato’ అంటున్నది ఒక అధ్యయనం.

యెస్.. సెల్(Cell) అనే ఒక సైంటిఫిక్ జర్నల్‌లో పబ్లిషైన రీసెంట్ స్టడీ ప్రకారం.. ప్రపంచంలోనే మూడవ అతిముఖ్యమైన ప్రధాన పంటగా ఉన్న బంగాళ దుంప స్వతహాగా పుట్టుకొచ్చింది కాదు. అది రెండు వేర్వేరు పురాతన గడ్డి మొక్క జన్యువుల కలయిక నుంచి ఉద్భవించింది. అంటే టమాటా, అలాగే ఎటుబెరోసమ్ అనే అడవి మొక్కల కలయికవల్ల ఆలుగడ్డ అనే కొత్తరకం కూరగాయ జన్మించింది. అంటే.. ఆలుగడ్డ హైబ్రిడ్ కూరగాయ..! పరిశోధకుల ప్రకారం సుమారు 9 మిలియన్ సంవత్సరాల కింద ఈ ఆశ్చర్యకరమైన కలయిక సంభవించిందని యూకే, కెనడా, చైనా దేశాలకు చెందిన శాస్త్రవేత్తల సంయుక్త పరిశోధన పేర్కొన్నది.

ఆలుగడ్డలోని పిండి పదార్థం ‘Tuber switch’ అనే టమాటాలోని గడ్డిలాంటి పదార్థం నుంచి వచ్చిందని, ఇక భూగర్భ కాండం పెరుగుదల అనేది ఎటుబెరోసమ్ అనే మొక్క నుంచి వచ్చిందని పరిశోధన పేర్కొన్నది. సో.. ‘ఆలుగడ్డకు టమాట తల్లి అయితే, ఎటుబెరోసమ్ అనే గడ్డి మొక్క తండ్రి’ అని చైనాలోని షెన్‌జెన్‌లో గల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ జెనెటిక్స్‌కు(Institute of Agricultural Genetics) చెందిన ప్రొఫెసర్ సాన్వెన్ హువాంగ్ (Professor Sanwen) పేర్కొన్నారు. అదీ సంగతి..! Link

Next Story