పుట్టగొడుగులతో భవిష్యత్ రోబోలు.. ఆర్గానిక్ మెమరీ డివైజ్‌లు సైతం!

by Javid Pasha |

పుట్టగొడుగుల్లోని ఫంగస్ మైసీలియంను ప్రాసెస్ చేసి డిజిటల్ కమాండ్‌లుగా మార్చడం ద్వారా రోబోలను నింయంత్రించవచ్చు.

పుట్టగొడుగులతో భవిష్యత్ రోబోలు.. ఆర్గానిక్ మెమరీ డివైజ్‌లు సైతం!
X

దిశ, ఫీచర్స్ : భవిష్యత్‌ రోబోటిక్ టెక్నాలజీని ఎకో-ఫ్రెండ్లీ వ్యవస్థగా మార్చడంపై సాంకేతిక శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా కార్నెల్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారు. పుట్టగొడుగు(కింగ్ ఓయిస్టర్)లను ఉపయోగించి రోబోలను ఆపరేట్ చేయవచ్చునని కనుగొన్నారు. పరిశోధనలో భాగంగా వారు జీవ-హైబ్రిడ్ (biohybrid) సిస్టమ్‌ను రూపొందించారు. ఇందులో జీవించే ఫంగల్ మైసీలియం (Mushroom root network)నుంచి వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్‌ను గ్రహించి, వాటిని రోబో కమాండ్‌లుగా మార్చారు. ఈ పరిశోధనలు భవిష్యత్‌లో ఎకో-ఫ్రెండ్లీ టెక్నాలజీకి కొత్త దారులు వేస్తాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

డిజిటల్ కమాండ్స్

పుట్టగొడుగుల్లోని ఫంగస్ మైసీలియం సిగ్నల్స్‌ను రీడ్ చేసి, ప్రాసెస్ చేసి డిజిటల్ కమాండ్‌లుగా మార్చడం ద్వారా చిన్న చిన్న చక్రాలు ఉన్న రోబోలనే కాకుండా, సాఫ్ట్ స్టార్‌ఫిష్ ఆకారంలోని రోబోలను కూడా నియంత్రించగలిగారు. ఇక్కడ మష్రూమ్స్‌లోని మైసీలియం సహజంగా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ (చిన్న వోల్టేజ్ స్పైక్స్) విడుదల చేస్తుంది. కాబట్టి శాస్త్రవేత్తలు ఈ సిగ్నల్స్‌ను రీడ్ చేసి, ప్రాసెస్ చేసి, రోబోట్ మోటార్లు లేదా యాక్చుయేటర్లకు డిజిటల్ కమాండ్‌లుగా మార్చారు.

ఆర్గానిక్ మెమరీ డివైజ్..

ఓహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా పుట్టగొడుగులలో మరో విషయాన్ని కనుగొన్నారు. ఇవి సహజంగానే ఆర్గానిక్ మెమరీ డివైజ్‌లాగా పని చేస్తాయని తేల్చారు. ఇందులో భాగంగా షియిటేక్ & బటన్ మష్రూమ్‌లను ఉపయోగించి ఆర్గానిక్ మెమరీ డివైజ్‌లు(memristors)తయారు చేశారు. ఇవి ఎలక్ట్రికల్ స్టేట్స్‌ను గుర్తుంచుకుని, కంప్యూటర్ మెమరీలాగా పని చేస్తాయి. వీటి స్పీడ్ కొన్ని వేల సిగ్నల్స్(సుమారు 5,850 వరకు) పర్ సెకండ్ వరకు ఉంటుంది. కాబట్టి భవిష్యత్ కంప్యూటర్లు, మెమరీలు తయారు చేయడానికి పుట్టగొడుగులను ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.

Next Story