- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊపిరితిత్తుల వైఫల్యం నుంచి రక్షణకు.. ఆక్సిజన్ మైక్రోపార్టికల్స్!
ఆక్సిజన్ మైక్రోపార్టికల్స్ ఊపిరితిత్తులు పని చేయని సందర్భాల్లో కీలకంగా పని చేస్తాయి.

దిశ, ఫీచర్స్ : అత్యవసర వైద్య పరిస్థితుల్లో రోగి శ్వాస తీసుకోవడం కష్టంగా మారినప్పుడు సాధారణంగా ఆక్సిజన్ మాస్క్ లేదా వెంటిలేటర్ ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు పరిశోధకులు ఊపిరితిత్తులను పూర్తిగా దాటవేసి నేరుగా రక్తంలోకి ఆక్సిజన్ అందించే కొత్త సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇంజెక్టబుల్ ఆక్సిజన్ మైక్రోపార్టికల్స్ (Oxygen Gas-Filled Microparticles) అని పిలువబడే ఈ సూక్ష్మ కణాలను రోగి రక్తంలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా శ్వాస లేని సమయంలో కూడా శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయవచ్చు. ఇది శ్వాసకోశ సహాయ రంగంలో ఒక ముఖ్యమైన పురోగతిగా నిపుణులు పేర్కొంటున్నారు.
ఆక్సిజన్ మైక్రోపార్టికల్స్ ఊపిరితిత్తులు పని చేయని సందర్భాల్లో లేదా శ్వాసనాళం తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు చాలా కీలకంగా పని చేస్తాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడం ద్వారా అవయవాల వైఫల్యం, మెదడు దెబ్బతినకుండా కాపాడతాయి. ఇవి సూక్ష్మ లిపిడ్ (కొవ్వు) పొరలతో తయారు చేయబడి, ఆక్సిజన్‌ను సురక్షితంగా రక్తంలోకి విడుదల చేస్తాయి. ఈ సాంకేతికతను బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చెందిన డా. జాన్ కెయిర్ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ ట్రామా, కార్డియాక్ అరెస్ట్ వంటి అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సను పూర్తిగా మార్చేసే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది జంతు పరీక్షల దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఇంటెన్సివ్ కేర్, ఎమర్జెన్సీ మెడిసిన్‌తోపాటు వివిధ వైద్య రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.






