Who Fi : ఇక రహస్యమంతా బట్టబయలే..! మీరెక్కడున్నా క్షణాల్లో గుర్తించే ఏఐ సిస్టమ్‌ను డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు

by Javid Pasha |

Who Fi : ఇక రహస్యమంతా బట్టబయలే..! మీరెక్కడున్నా క్షణాల్లో గుర్తించే ఏఐ సిస్టమ్‌ను డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు

Who Fi : ఇక రహస్యమంతా బట్టబయలే..! మీరెక్కడున్నా  క్షణాల్లో గుర్తించే ఏఐ సిస్టమ్‌ను డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్ : ఎవరైనా తప్పిపోయినప్పుడు లేదా మరేదైనా ప్రత్యేక పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు వారెక్కడున్నారో తెలుసుకోవడానికి సాంకేతిక పరంగా అందుబాటులో ఉన్న ఏకైక మార్గం వైఫై సిగ్నల్స్ ఆధారంగా వారి మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేయడం. ఒకవేళ సదరు వ్యక్తివద్ద ఫోన్ లేకపోతే ఇది సాధ్యం కాదు. కానీ ఇకముందు సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి చేతిలో ఫోన్, కెమెరా లేదా ఇతర ఏ డివైస్ లేకుండానే జస్ట్ వైఫై సిగ్నల్స్ ఆధారంగా వారు ఎక్కడున్నారో గుర్తించే సరికొత్త ఏఐ సిస్టమ్‌ను రోమ్‌లోని లా సపియెంజా( La Sapienza) యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనికి వూ(WhoFi) ఫై అని పేరు పెట్టారు.

వూఫై (హూ Fi) సాంకేతికత మానవ శరీర కదలికలను వైఫై సిగ్నల్స్‌ను ఆధారంగా గుర్తించేందుకు అవసరమైన ఒక డిజిటల్ ఫింగర్ ప్రింట్‌ను ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది. దీంతో ఆ పరికరం వ్యక్తులు చీకటిలో ఉన్నా, గోడ వెనుక ఉన్నా, రియల్ టైమ్ సిగ్నల్స్‌లోని మార్పులను గుర్తించి 95.5% కచ్చితత్వంతో పనిచేస్తుంది. అంటే చానల్ స్టే్ట్ ఇన్ఫర్మేషన్ (CSI) అనే టెక్నిక్ ద్వారా వై-ఫై సిగ్నల్స్‌లోని సూక్ష్మమైన మార్పులను విశ్లేషించి, ఒక వ్యక్తిని శరీర ఆకృతి, కదలికల ఆధారంగా గుర్తిస్తుంది.

సరికొత్త వూఫై (WhoFi) సిస్టమ్ విస్తృతంగా అందుబాటులోకి వస్తే స్మార్ట్ భవనాలు, భద్రతాపరమైన వ్యవస్థలలో ఉపయోగపడవచ్చు. ఉదాహరణకు హాస్పిటల్స్‌‌లో రోగుల కదలికలను గమనించవచ్చు. ఇండ్లల్లో ఆటోమేటిక్ లైటింగ్, క్లైమేట్ నియంత్రణలో ఉపయోగించవచ్చు. అయితే ఇది వ్యక్తిగత గోప్యతకు పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే.. జస్ట్ వైఫై నెట్వర్క్ ఉంటే చాలు.. ఒక వ్యక్తిని, అతని/ఆమె పర్మిషన్ లేకుండానే ఎక్కడ ఉన్నారనేది ట్రాక్ చేసేస్తుంది. కాబట్టి కఠినమైన మార్గదర్శకాలు, నిబంధనలు అవసరం కావచ్చు. అయితే ఈ విధమైన టెక్నాలజీని సాంకేతిక విప్లవమా? ప్రైవసీకి ఆటంకమా అనేది కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. Link

Next Story