- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాన్సర్ కణాలను గుర్తించే గాగుల్స్.. సాంకేతిక రంగంలో మరో ఆవిష్కరణ..!
క్యాన్సర్ కణాలను గుర్తించే గాగుల్స్.. సాంకేతిక రంగంలో మరో ఆవిష్కరణ..!

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ మొత్తం మానవ జీవితాన్ని మలుపుతిప్పుతోంది. అనేక రంగాల్లో పనులను, సేవలను సులభతరం చేస్తోంది. ఆధునిక పరిశోధనల్లో, రోగ నిర్ధారణల్లో అద్భుతాలు చేస్తోంది. అలాంటిదే మరో ఆవిష్కరణ మనముందకు వచ్చింది. శస్త్ర చికిత్సల సమయంలో ధరించడంవల్ల క్యాన్సర్ కణాలను ఈజీగా గుర్తించగల సరికొత్త గాగుల్స్‌ను వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ లూయిస్‌లోని ఆప్టికల్ రేడియాలజిస్టు, పరిశోధకుడు అయిన డాక్టర్ సామ్యూల్ అచిలెఫు(Dr. Samuel Achilefu) డెవలప్ చేశాడు.
కొత్తగా డెవలప్ చేసిన క్యాన్సర్ - సీయింగ్ గాగుల్స్ (Cancer - Seeing Goggles) శస్త్ర చికిత్సల సమయంలో వ్యక్తి బాధిత వ్యక్తుల శరీరంలోని క్యాన్సర్ కణాలను గుర్తించడంలో, తొలగించడంలో సర్జన్లకు సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో పొందుపరిచిన సాంకేతిక వ్యవస్థ ఒక ప్రత్యేక పెప్టైడ్ డై(Peptide dye)ని ఉపయోగిస్తుంది. ఇది సాధారణ లైటింగ్, వెలుతురు పరిస్థితుల్లో సైతం డాక్టర్లకు కనిపించని తరంగ దైర్ఘ్యాల వద్ద ప్రకాశిస్తుంది. సెన్సార్లతో కూడిన గాగుల్స్ ఈ ఫ్లోరోసెన్స్‌ను గుర్తించి, క్యాన్సర్ కణాలను సర్జన్ దృష్టిలో నీలం రంగులో ప్రొజెక్ట్ చేస్తాయి. దీనివల్ల వాటిని రియల్ టైమ్‌లో చూసి తొలగించడానికి వీలవుతుంది. ఇప్పటి వరకు 27 మంది లివర్ అండ్ చెస్ట్ క్యాన్సర్ రోగుల శస్త్ర చికిత్సలో ఈ క్యాన్సర్ సీయింగ్ గాగుల్స్ అద్భుతంగా ఉపయోగపడినట్లు పరిశోధకులు చెబుతున్నారు. LINK






