- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రుడి వెలుతురుతో విద్యుదుత్పత్తి..! సరికొత్త పరికరాన్ని డెవలప్ చేసిన నిపుణులు
ఈ సరికొత్త పరికరాన్ని పరిశోధకులు ‘‘నైట్‌టైమ్ ఫోటోవోల్టాయిక్ సెల్‌గా పిలుస్తున్నారు. ఇది రేడియేటివ్ కూలింగ్, అలాగే అత్యంత సున్నితమైన ఫోటోవోల్టాయిక్ పదార్థాలను ఉపయోగించి చంద్రుని కాంతి నుండి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

దిశ, ఫీచర్స్ : నీటి ద్వారా, సౌర శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాధ్యమనే విషయం మనకు తెలిసిందే. కానీ రాత్రిపూట ఆకాశంలో కనిపించే చంద్రుడి చల్లని వెలుతురు నుంచి కూడా అలా చేయవచ్చునని మీకు తెలుసా? స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ షాన్ హుయి ఫాన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ సరికొత్త ఆవిష్కరణకు తెరతీసింది. చంద్రుడి వెలుతురు నుంచి శక్తిని గ్రహించి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగల పరికరాన్ని అభివృద్ధి చేసింది.
తాజా పరికరానికి దానిని అభివృద్ధి చేసిన పరిశోధకులు ‘‘నైట్‌టైమ్ ఫోటోవోల్టాయిక్ సెల్’’ లేదా ‘‘మూన్‌లైట్ సోలార్ ప్యానెల్’’గా పిలుస్తుున్నారు. ఇది రేడియేటివ్ కూలింగ్, అలాగే అత్యంత సున్నితమైన(most sensitive) ఫోటోవోల్టాయిక్ పదార్థాలను ఉపయోగించి చంద్రుని కాంతి నుండి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కొన్ని పరిస్థితుల్లో విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో సౌర ఫలకాలకంటే కూడా 35% వరకు మెరుగైన పనితీరును కనబరుస్తుందని పరిశోధకులు అంటున్నారు.
చంద్రుడి నుంచి పరావర్తనం చెందే కాంతిని స్వయం ప్రాసెస్ చేసుకొని కరెంటును ఉత్పత్తి చేసే మూన్‌లైట్ సోలార్ ప్యానెల్ ప్రస్తుతం వాణిజ్య పరంగా విస్తృత ఉపయోగంలో లేదు. అయితే భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. చంద్రుని నుండి పరావర్తనం చెందే స్వల్ప కాంతిని సంగ్రహించి విద్యుత్తుగా మార్చగల ఈ డివైజ్ గ్రామీణ ప్రాంతాలు, అంతరిక్ష మిషన్లు, విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో రాత్రిళ్లు వెలుతురు కోసం ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు.






