ఇక ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకోవచ్చు..! ఆర్టిఫిషియల్ కిడ్నీలను అభివృద్ధి చేసిన పరిశోధకులు

by Javid Pasha |

పరిశోధకులు ప్రస్తుతం ధరించగలిగే డయాలసిస్ పరికరాన్ని అంటే బ్యాక్‌ప్యాక్ పరిమాణంలోని హేమోడయలసిస్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తున్నారు.

ఇక ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకోవచ్చు..! ఆర్టిఫిషియల్ కిడ్నీలను అభివృద్ధి చేసిన పరిశోధకులు
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది ఎదుర్కొంటున్న తీవ్రమైన అనారోగ్య సమస్యల్లో కిడ్నీల వైఫ్యలం ఒకటి. రెండు కిడ్నీలు పూర్తిగా పాడైతే మనిషి బతకలేరు. ఇక వాటి పనితీరు మందగిస్తే రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోతే చనిపోతారు. అయితే ప్రస్తుతం డయాలసిస్ అనేది హాస్పిటల్‌లోనే వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేసే ప్రక్రియగా ఉంది. ఇది అధిక సమయం, ఎక్కువ రిస్క్‌తో కూడినదిగా ఉంది. కానీ సమీప భవిష్యత్తులో అలాంటి రిస్క్ ఉండకపోవచ్చు. ఎందుకంటే బాధితులు తాము ఉన్నచోటనే ధరించగలిగే ఆర్టిఫిషియల్ కిడ్నీలు(Wearable artificial kidneys) అందుబాటులోకి రానున్నాయి.

ఎవరు డెవలప్ చేశారు?

కిడ్నీ వైఫల్య బాధితులకు ప్రత్యామ్నాయ చికిత్సా మార్గాలు, సాంకేతికత వినియోగంపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా లాస్ ఏంజిల్స్‌లోని సీడార్స్ - సినాయ్ మెడికల్ సెంటర్‌లో నెఫ్రాలజిస్ట్‌గా పనిచేస్తూ, అక్కడి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరియాలోని క్లినికల్ మెడిసిన్ విభాగంలోఅసోసియేట్ ప్రొఫెసర్‌గానూ పనిచేస్తున్న డాక్టర్ విక్టర్ గురా కీడ్నీ వైఫ్యల సమస్యను పరిష్కరించే కొత్త ఆవిష్కరణకు తెరతీశాడు. కిడ్నీల పనితీరు మందగించినప్పుడు హాస్పిటల్ అవసరం లేకుండానే నిరంతరం రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఆర్టిఫిషియల్ (Portable device) కిడ్నీలను డెవలప్ చేశాడు. ఆ తర్వాత ఎడిన్ బరా యూనివర్సిటీ ప్రొఫెసర్ గ్రాజియా డి ఏంజెలిస్ బృందం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో డాక్టర్ ఇరా కుర్త్జ్, రోలాండ్ లుబడ్లో, జేమీ హెసెక్టిన్, సీఓల్ నేషనల్ యూనివర్సిటీలోలో ప్రొఫెసర్ సుంగ్ జే కిమ్ బృందాలు కూడా దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాయి.

ప్రయోగాల్లో సక్సెస్

ధరించగలిగే కిడ్నీలు ఇప్పటికే ఒకసారి మానవ ప్రయోగాల్లో పరీక్షించబడ్డాయి. కాగా 2016లో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో జరిగిన మొదటి మానవ ప్రయోగాల్లో WAK అనే వెరబుల్ డయాలసిస్ పరికరం యూరిన్‌లో యూరియా, క్రియాటినిన్, ఫాస్ఫరస్‌ను సమర్థవంతంగా తొలగించింది. బ్లడ్ ప్రెజర్‌ను స్థిరంగా ఉంచింది. ఈ ప్రయోగాలు యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) అనుమతితో జరిగాయి. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు. కాబట్టి వెరబుల్ డయాలసిస్ పరికరాలు కిడ్నీ వైఫల్య బాధితులకు మెరుగైన జీవన నాణ్యతను అందించే చక్కటి మార్గంగా పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇది రోజువారీ డయలసిస్‌ను సాధ్యం చేసి, హార్ట్ డిసీజ్, స్ట్రోక్ ప్రమాదాలను తగ్గిస్తుంది. ఇక WAK 3.0 వెర్షన్ 2021లోనే యూఎస్‌లో పేటెంట్ పొందింది. మరో రెండు మానవ ప్రయోగాల తర్వాత పూర్తిస్థాయిలో FDA నుంచి అనుమతి రావచ్చునని పరిశోధకులు ఆశిస్తున్నారు.

ఎలా పనిచేస్తాయి?

పరిశోధకులు ప్రస్తుతం ధరించగలిగే డయాలసిస్ పరికరాన్ని అంటే బ్యాక్‌ప్యాక్ పరిమాణంలోని హేమోడయలసిస్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తున్నారు. ఈ సిస్టమ్‌లో ‘స్మార్ట్’ ఫిల్టర్లు ఉపయోగించి డయలసిస్ ద్రవాన్ని సఫరా అయ్యేలా చేస్తారు. దీంతో అది ఉల్ట్రాప్యూర్ వాటర్ అవసరాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మెషిన్ లెర్నింగ్ ద్వారా వేలాది ఫిల్టర్ మెటీరియల్ కాంబినేషన్లను విశ్లేషించి, యూరియా వంటి టాక్సిన్లను సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఇప్పటికే KidneyX ఇన్నోవేషన్ అవార్డ్ పొందింది. పూర్తిస్థాయి ప్రయోగాల తర్వాత డయాలసిస్ అవసరమయ్యే కిడ్నీ రోగుల కోసం వాణిజ్య పరంగా ఆస్పత్రులలో అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు అంటున్నారు. ప్రపంచ వైద్య చరిత్రలో ఇదొక గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు.

Next Story