- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోడలకు అవతలి వస్తువులను చూడగలిగే కెమెరా.. జపనీస్ సాంకేతిక నిపుణుల ఆవిష్కరణ!
దాగిన వస్తువులను చూడగలిగే కెమెరాను జపాన్‌లోని నారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ ఇంజినీరింగ్ పరిశోధకులు కలిసి డెవలప్ చేశారు.

దిశ, ఫీచర్స్ : ఫోన్‌లోని కెమెరా యాప్‌తో గానీ, కేవలం ఫొటో తీయడానికే ఉద్దేశించిన కెమెరాలతో గానీ మన కంటికి కనిపించే వస్తువులను, వ్యక్తులను, దృశ్యాలను మాత్రమే చిత్రీకరించగలం. కానీ కనిపించని వస్తువులను, ముఖ్యంగా గోడలకు అవతలివైపు, ఇంట్లోని మూలల్లో దాచిన లేదా దాగిన వస్తువులను సైతం గుర్తించి ఫొటో తీయగల కెమెరా ఉంటుందని మీకు తెలుసా? ఇన్ని రోజులైతే లేకుండె.. కానీ ఇక ముందు అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉంది. ఎందుకంటే జపాన్‌లోని నారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(Nara Institute of Science & Technology), అండ్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ (UCLA) ఇంజినీరింగ్ పరిశోధకులు కలిసి ఈ సరికొత్త కెమెరా సిస్టమ్‌ను డెవలప్ చేశారు.
3D ఆకారాలను నిర్మిస్తుంది?
పరిశోధకులు రూపొందించిన అధునాతన కెమెరా సిస్టమ్ స్కాటర్డ్ పోలరైజ్డ్ లైట్ (Scattered polarized light)ను గుర్తించి, అడ్డంకుల వెనుక దాగి ఉన్న వస్తువుల 3D ఆకారాలను పునర్నిర్మించగలదు. అంటే ఈ టెక్నాలజీ ‘నాన్-లైన్-ఆఫ్-సైట్ ఇమేజింగ్ (NLOS)’ పద్ధతిని ఉపయోగిస్తుంది. దీంతో కెమెరా నేరుగా చూడలేని వస్తువులను, గోడలు లేదా ఇతర అడ్డంకుల నుంచి పరావర్తనమై వచ్చే కాంతి ఆధారంగా గుర్తిస్తుంది.
ఎలా గుర్తిస్తుంది?
ఉదాహరణకు.. ఒక రూములోని మూలలో ఉన్న వస్తువు వైపు ‘పోలరైజ్డ్ నాన్-లైన్-ఆఫ్-సైట్ ఇమేజింగ్ సిస్టమ్’ కెమెరాను ఆన్ చేసి పెడితే.. అక్కడున్న వస్తువు మనకు కనిపించనప్పటికీ, దాని నుంచి వెలువడే నీడ లేదా కాంతి గోడపై పడి, మళ్లీ కెమెరాకు చేరే కాంతికి సంబంధించిన పోలరైజేషన్(ధ్రువీకరణ)ను, సమయ వ్యత్యాసాలను (time-of-flight) విశ్లేషించి, AI అల్గారిథమ్‌లతో 3D మోడల్‌ను రీకన్‌స్ట్రక్ట్ చేస్తుంది. అంటే నిజానికి ఇది గోడల గుండా చూడటం కాదు. కాకపోతే కనిపించని వస్తువుకు సంబంధించి కాంతి వదిలిపెట్టిన ‘ఫుట్ ప్రింట్’ను చదవడం లేదా విశ్లేషించడం లాంటిది. కాబట్టి ఇది డిఫెన్స్, అటానమస్ వెహికిల్స్‌కు గేమ్ చేంజర్ అంటున్నారు నిపుణులు.
80% కచ్చితత్వంతో..
‘పోలరైజ్డ్ నాన్-లైన్-ఆఫ్-సైట్ ఇమేజింగ్ సిస్టమ్’ భవిష్యత్తులో రెస్క్యూ ఆపరేషన్స్(ధ్వంసమైన భవనాల్లో శిథిలాల కింద చిక్కుకుపోయిన లేదా బతికి ఉన్నవారిని గుర్తించడం), స్వయంచాలక వాహనాల్లో ఉపయోగించడం ద్వారా కార్నర్ చుట్టూ రాబోయే అడ్డంకులను ముందుగా చూడటం, మెడికల్ ఇమేజింగ్‌లో టిష్యూ లోపల దాగిన సమస్యలను గుర్తించడం వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు రాగలదని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే ల్యాబ్ టెస్టుల్లో 1 మీటర్ దూరంలోని దాగిన వస్తువులను 80% కచ్చితత్వంతో గుర్తించగలిగింది. జపాన్ సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ సైన్స్ (JSPS) ఫండింగ్‌తో రియల్-వరల్డ్ అప్లికేషన్స్ కోసం మెరుగుపరుస్తున్నారు. అయితే ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. భవిష్యత్తులో లైడార్, AI కలయికతో మరింత శక్తివంతమవుతుంది. ‘కాంతి ఎక్కడికి వెళ్తుందో అక్కడే సమాచారం దాగి ఉంటుంది’ అనే సూత్రంతో పనిచేసే ఈ టెక్నాలజీ మానవ దృష్టిని అధిగమిస్తుందని నిపుణులు అంటున్నారు. Link






