నేలలో కుళ్లిపోయే వెదురు ప్లాస్టిక్‌ను డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు.. ఉపయోగాలేమిటంటే..

by Javid Pasha |   (  Updated:2025-10-27 06:20:23  IST  )

శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బయోడిగ్రేడబుల్ బంబూ ప్లాస్టిక్ సహజంగా నేలలో కుళ్ళిపోయే పదార్థం. కాబట్టి అది విషపూరిత రసాయనాలు వదలకుండా పర్యావరణానికి మేలు చేస్తుంది.

నేలలో కుళ్లిపోయే వెదురు ప్లాస్టిక్‌ను డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు.. ఉపయోగాలేమిటంటే..
X

దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ పర్యావరణానికి హాని చేస్తుందన్న విషయం తెలిసిందే. అందుకు దాని వాడకం తగ్గించాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయాలపై కూడా చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా చైనాలోని నార్త్ ఈస్ట్ ఫారెస్ట్రీ యూనివర్సిటీ పరిశోధకులు ఒక సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు. వెదురు(బంబూ) సెల్యులోస్‌ను ఉపయోగించి ఒక కొత్త బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్‌ను డెవలప్ చేశారు. అయితే దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు చూద్దాం.

*శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బయోడిగ్రేడబుల్ బంబూ ప్లాస్టిక్ సహజంగా నేలలో కుళ్ళిపోయే పదార్థం. కాబట్టి అది విషపూరిత రసాయనాలు వదలకుండా పర్యావరణానికి మేలు చేస్తుంది. పైగా ఇది సాంప్రదాయ పెట్రోలియం ప్లాస్టిక్‌లతో సమానమైన బలం, అలాగే వేడి నిరోధకతను(Strength and heat resistance)కలిగి ఉంటుంది. కాబట్టి పర్యావరణ అనుకూల పదార్థాలలో ఒక పెద్ద పురోగతిగా నిలుస్తుంది.

*వెదురు ప్లాస్టిక్ (Bamboo is plastic) ప్యాకేజింగ్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ రంగాలలో సాంప్రదాయ ప్లాస్టిక్‌లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే ఇది ఆహారం, వస్తువుల ప్యాకింగ్‌కు పర్యావరణ అనుకూల ప్లాస్టిక్. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేసింగ్‌లకు కూడా అనువైనది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

*నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో పేర్కొన్న అధ్యయన వివరాల ప్రకారం ఈ బంబూ ఆధారిత ప్లాస్టిక్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయగలిగితే, అది పర్యావరణ పరిరక్షణలో చాలా మార్పులను తీసుకురావచ్చు. ఈ పదార్థం ఉత్పత్తి వ్యయం, స్కేలబిలిటీ(Scalability)పై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ దీని పర్యావరణ అనుకూల స్వభావం కారణంగా భవిష్యత్తు ప్లాస్టిక్ పరిశ్రమకు ఒక ఆశాజనక పరిష్కారంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. Link

Next Story