- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగుతున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే?
ప్లాస్టిక్ బాటిల్ లో ( plastic bottles) మంచినీళ్లు ( Drinking Water )తాగుతున్నారా? అయితే మీరు రోగాలు కొనితెచ్చుకున్నట్లే

దిశ, వెబ్ డెస్క్: ప్లాస్టిక్ బాటిల్ లో ( plastic bottles) మంచినీళ్లు ( Drinking Water )తాగుతున్నారా? అయితే మీరు రోగాలు కొనితెచ్చుకున్నట్లే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో నేరుగా మంచినీళ్లు తాగడం వల్ల... గుండె (Heart) అలాగే బీపీ సమస్యలు (high blood pressure) వస్తాయని.. అమెరికాకు సంబంధించిన ఓ ప్రముఖ సంస్థ ప్రకటన చేసింది. మనం బయటకు వెళ్ళినప్పుడు సాధారణంగా వాటర్ బాటిల్ కొనుక్కొని మంచి నీళ్లు తాగుతాం. కచ్చితంగా బయట దొరికే వాటర్ బాటిల్స్ అన్నీ కూడా.. ప్లాస్టిక్ తోనే తయారై ఉంటాయి.
తక్కువ ధరలో చిల్డ్ వాటర్ లభించడంతో మనం... ఆ ప్లాస్టిక్ బాటిల్స్ కొనుగోలు చేస్తాం. అయితే అలా ప్లాస్టిక్ బాటిల్స్ లో నేరుగా మంచినీళ్లు తాగడం వల్ల... అనేక రకాల రోగాలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు ( high blood pressure ) సంభవించే ప్రమాదం ఉందని చెబుతున్నారు అమెరికాకు సంబంధించిన నిపుణులు. అధిక రక్త పోటుతో పాటు.. కొంత మందికి గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ తయారీలో... సాధారణంగా బిస్ఫెనాల్ ఎ (BPA) అనే రసాయనం ఉంటుందని అంటున్నారు. BPA శరీర హార్మోన్ల సమతుల్యతకు ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు. దీనివల్ల రక్తపోటు పెరగడం, ఇతర హృదయ సంబంధ ప్రమాదాలు ( Cardiovascular risks) సంభవించవచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.






