- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వయసు మాత్రమే కాదు.. తెల్లజుట్టుకు అదీ ఓ కారణమే!
ఇతర కణాలు దెబ్బతిన్నప్పుడు శరీరం వాటిని సహజంగానే రిపేర్ చేసుకుంటుంది. కానీ ఈ మెలనోసైట్ స్టెమ్ సెల్స్ అయిపోయాక వాటిని తిరిగి భర్తీ చేసే ప్రక్రియ మాత్రం లేదు.

దిశ, ఫీచర్స్ : తెల్లజుట్టు రావడానికి మానసిక ఒత్తిడి కారణం అవుతుందా? అవుననే అంటున్నాయి హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రీయ పరిశోధనలు. స్ట్రెస్‌కు గురైనప్పుడు శరీరం ‘ఫైట్ ఆర్ ఫ్లై్ట్’ మోడ్‌లోకి వెళ్తుంది. ఈ సమయంలో నార్‌ఎపినెఫ్రిన్ (Norepinephrine)అనే ముఖ్యమైన న్యూరోట్రాన్స్‌మిటర్ & హార్మోన్ హెయిర్ ఫాలికల్స్ దగ్గర విడుదలవుతుంది. ఇదే జుట్టు నల్లగా ఉండేందుకు కారణమయ్యే మెలనోసైట్ స్టెమ్ సెల్స్‌ను వేగంగా క్షీణింపజేస్తుంది. ఈ స్టెమ్ సెల్స్ ఒకసారి అయిపోయాక, జుట్టు ఫాలికల్స్ ఇక నల్లటి రంగును ఇవ్వలేవు. కాబట్టి కొత్తగా మొలిచే జుట్టు గ్రే లేదా తెలుపు రంగులోనే వస్తుంది. చాలా సందర్భాల్లో ఈ సెల్స్ క్షీణత శాశ్వతంగా ఉండిపోతుంది. అంటే.. శరీరం వాటిని తిరిగి సృష్టించలేదు.
ఇతర కణాలు దెబ్బతిన్నప్పుడు శరీరం వాటిని సహజంగానే రిపేర్ చేసుకుంటుంది. కానీ ఈ మెలనోసైట్ స్టెమ్ సెల్స్ అయిపోయాక వాటిని తిరిగి భర్తీ చేసే ప్రక్రియ శరీరంలో లేదు. అయితే కేవలం ఒత్తిడివల్లనే జట్టు తెల్లబడుతుందా? వయసు పరంగా తెల్లబడదా? అనే సందేహం ఇక్కడ ఎవరికైనా కలుగుతుంది. వయసు, జన్యుశాస్త్రం కూడా తెల్లజుట్టుకు కారణమైనప్పటికీ, దీర్ఘకాలిక ఒత్తిడి దానిని మరింత వేగవంతం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి దీనిని ఆలస్యం చేయడానికి ఒత్తిడి నిర్వహణ ముఖ్యం అంటున్నారు నిపుణులు. అందుకోసం మైండ్‌ఫుల్‌నెస్, యోగా, నాణ్యమైన నిద్ర, వ్యాయామం వంటివి సహాయపడతాయి. మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే కేవలం మనసును మాత్రమే కాకుండా, మీ జుట్టు రంగును కూడా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






