మెన్‌స్ట్రువల్ పెయిన్ కూడా గుండెపోటు లాంటిదే..! ఆ సమయంలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్న కొందరు స్త్రీలు

by Javid Pasha |   (  Updated:2025-08-06 07:39:20  IST  )

మెన్‌స్ట్రువల్ పెయిన్ కూడా గుండెపోటు లాంటిదే..! ఆ సమయంలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్న కొందరు స్త్రీలు

మెన్‌స్ట్రువల్ పెయిన్  కూడా గుండెపోటు లాంటిదే..! ఆ సమయంలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్న కొందరు స్త్రీలు
X

దిశ, ఫీచర్స్ : స్త్రీలలో ప్రతీనెల మెన్‌స్ట్రువల్ సర్కిల్ ఒక సహజమైన ప్రక్రియ. ఈ సందర్భంగా మూడ్ స్వింగ్స్ వంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. అయితే నెలసరి నొప్పి ప్రభావం అందరిలో ఒకే విధంగా కూడా ఉండపోవచ్చు. ఆయా వ్యక్తుల వయసు, ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యతను బట్టి నొప్పి తీవ్రతలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. అయితే 20 -30% స్త్రీలలో మాత్రం ఈ నొప్పి గుండెపోటు స్థాయిలో తీవ్రంగా ఉంటున్నదని, ఈ భరించలేని బాధను ఇతరులు అర్థం చేసుకోలేకపోతున్నారని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ ఎమెరిటస్ ప్రొఫెసర్ జాన్ గెల్లెబాడ్ నిర్వహించిన అధ్యయనం ధృవీకరించింది.

రుతుస్రావంలో నొప్పి సహజమైన ప్రక్రియే కావచ్చు. అయితే ఫస్ట్ మెన్‌స్ట్రువల్ తర్వాత నుంచి కొద్ది సంవత్సరాల్లో తీవ్రమైన నొప్పిని యువతులు అనుభవిస్తుంటారు. దీనిని ప్రైమరీ డిస్మెనోరియాగా పేర్కొంటారు. ఇది యుక్త వయసులో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇందుకు భిన్నంగా 20–30% మంది స్త్రీలు మాత్రం రుతుస్రావ సమయంలో గుండెపోటుతో సమానమైన తీవ్రమైన నొప్పిని ఎదుర్కొంటున్నారని అధ్యయనం కనుగొన్నది. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ స్టడీ కూడా ఇదే వెల్లడించింది. నిజానికి ఆ సందర్భంలో బాధిత మహిళ ఎదుర్కొనే బాధ అంతా ఇంతా కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ నొప్పి గుండెపోటు కంటే తీవ్రమైన స్థాయిలో కూడా ఉంటుందని అధ్యయనం పేర్కొన్నది.

గుండెపోటు స్థాయిలో పీరియడ్ పెయిన్‌ను అనుభవించే బాధిత స్త్రీలు సన్నిహితుల వద్ద, పరిచయస్తులవద్ద, కుటుంబ సభ్యుల వద్ద ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు వెంటనే నమ్మే పరిస్థితులు ఉండట్లేదని, కుటుంబాల నుంచి, సమాజం నుంచి వారికి తగిన సానుభూతి, సహకారం కూడా లభించడం లేదని కూడా అధ్యయనం పేర్కొన్నది. ఎందుకంటే అది సాధారణ రుతుస్రావ నొప్పిగా భావిస్తుంటారు. ‘పీరియడ్ పెయిన్ కామనే కదా.. అలవాటై పోతుంది. తగ్గిపోతుంది’ వంటి మాటలతో తేలిగ్గా తీసిపారేస్తుంటారు. కానీ 20–30% స్త్రీలు ఎదుర్కొనే ఈ తీవ్రమైన రుతుస్రావ నొప్పి(డిస్మెనోరియా) మాత్రం డిఫరెంట్ అని, అది గుండెపోటుకంటే ఎక్కువ బాధాకరమైనదని పరిశోధకులు తేల్చారు. కాబట్టి సాధారణంగా పరిగణించి తేలిగ్గా తీసుకోవద్దని, బాధిత స్త్రీలకు ఆ సమయంలో కుటుంబం, సమాజం నుంచి తగిన సానుభూతి, ఎమోషనల్ సపోర్ట్ అవసరమని పరిశోధకులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. Link

Next Story