- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mars : అంగారకుడిపై నివాసం కష్టమే.. ఆ సమయానికి మించి అక్కడ ఉంటే జరిగేది ఇదే..!
Mars : అంగారకుడిపై నివాసం కష్టమే.. ఆ సమయానికి మించి అక్కడ ఉంటే జరిగేది ఇదే..!

దిశ, ఫీచర్స్ : భూ గ్రహం కాకుండా మనం నివసించడానికి ఈ విశ్వంలో ప్రత్యామ్నాయ గ్రహం ఏదైనా ఉందా? అంటే ఠక్కుమని అంగారక గ్రహం(Mars ) పేరు చెబుతారు ఎవరైనా. స్పేస్‌ఎక్స్ (SpaceX) వంటి అంతరిక్ష సంస్థలు, కంపెనీలు సైతం అంగారక గ్రహానికి భవిష్యత్తులో సిబ్బందితో కూడిన మిషన్‌ల కోసం సిద్ధం అవుతున్నాయి. కానీ.. తాజా పరిశోధన మాత్రం అక్కడ జీవరాశి మనుగడకు అవకాశాలు ఉండకపోవచ్చునని, ఆశలు వదులుకోవాల్సిందేనంటోంది. ఇందుకు సంబంధించిన వివరాలు స్పేస్ వెదర్‌లో పబ్లిష్ అయ్యాయి.
మార్స్(Mars )పై మానవులు నివసించడం అనేది అంత ఈజీకాదు. మహా అయితే గరిష్టంగా నాలుగు సంవత్సరాలు మాత్రమే నివసించగలరని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్( UCLA), మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT ), ఇతర అంతర్జాతీయ సంస్థల శాస్త్రవేత్తలు నేతృత్వం వహించిన రీసెంట్ స్టడీ పేర్కొన్నది. ఆ తర్వాత కాస్మిక్ రేడియేషన్ ప్రాణాంతకంగా మారుతుందని పరిశోధకులు వెల్లడించారు.
అంగారకుడి(Mars )పై భూమి మాదిరి రక్షణ కల్పించే ఆయస్కాంత క్షేత్రం లేకపోవడాన్ని ప్రధాన సమస్యగా పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా సూర్యుడి నుంచి, లోతైన అంతరిక్షం నుంచి వచ్చే హానికరమైన కాస్మిక్ కిరణాల(Harmful cosmic rays) నుంచి మార్స్‌కు రక్షణ ఉండదని చెబుతున్నారు. అయితే ప్రస్తుతమున్న సాంకేతికతతో మార్స్‌కు రౌండ్ - ట్రిప్ మిషన్ రెండు సంవత్సరాలలోపు పూర్తి చేయవచ్చునని, ఇది వ్యోమగాములను సురక్షిత రేడియేషన్ ఎక్స్‌పోజర్ పరిమితిలో ఉంచడంలో సహాయపడుతుందని అంటున్నారు.






