- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Calcium deficiency : యువతలోనూ కాల్షియం లోపం.. ఏయే సమస్యలకు దారితీస్తుందంటే..
Calcium deficiency : యువతలోనూ కాల్షియం లోపం.. ఏయే సమస్యలకు దారితీస్తుందంటే..

దిశ, ఫీచర్స్ : శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన ఖనిజాల్లో కాల్షియం ఒకటి. ఎముకలు, దంతాలు, కండరాల బలానికి, వాటి సమర్థవంతమైన పని తీరుకు ఇది చాలా ముఖ్యం. అయితే ఒకప్పుడు మిడిల్ ఏజ్ గల వారిలోనే దీని లోపం కారణంగా తలెత్తే సమస్యలు అధికంగా కనిపించేవి. కానీ ఈరోజుల్లో యువతరాన్ని సైతం వేధిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 22 శాతం మంది యువతీ యువకులు కాల్షియం లోపంతో ఆయా పనుల్లో, కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం.
పగుళ్లు, ఎముకల నొప్పి
ఎముకల్లో నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, ఎముకలు, కండరాల్లో పగుళ్లు వంటివి కూడా కాల్షియం లోపానికి సంకేతాలుగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా బోన్స్ పెళుసుగా మారడం, చిన్న దెబ్బ తగిలినా తీవ్రంగా గాయపడటం, గాయం త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాల్షియం అధికంగా లభించే ఆహారాలు, ముఖ్యంగా నువ్వులు, అవిసి కూర, కరివేపాకు, రాగులు, ఉలవలు, సాల్మన్ చేపలు, టోఫు, వైట్ బీన్స్, బ్రోకలి, అత్తి పండ్లు, పాలు, ఆకు కూరలు ఆహారంలో భాగంగా తీసుకోడం వల్ల క్రమంగా ఈ సమస్యను అధిగమించవచ్చు. దీంతోపాటు ఎముకల సాంద్రతను బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యాయామాలు చేయాలంటున్నారు ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు.
కాళ్లు, చేతుల్లో జలదరింపులు
ఒకే దగ్గర కూర్చొని పనిచేస్తున్న ఉద్యోగుల్లో, ముఖ్యంగా చదువుకుంటున్న యువతలో అకస్మాత్తుగా కాళ్లు, చేతులు కొద్ది క్షణాలు వణకడం లేదా జలదరింపులు, తిమ్మిరి సంభవించడం వంటి ప్రాబ్లమ్స్ ఇటీవల కామన్ అయిపోతున్నాయి. ఇది కాల్షియం లోపానికి సంకేతమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలకూర, బచ్చలి కూర, తోటకూర, మొక్కల ఆధారిత ఆహారాలు, పాలు, సాల్మన్ చేపలు, బచ్చలికూర, మెగ్నీషియం, విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడంవల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆరోగ్య నిపుణుల సూచనలను బట్టి లోపాన్ని అధిగమించడానికి అవసరమైతే కాల్షియం సప్లిమెంట్లు కూడా యూజ్ చేయవచ్చు.






