- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి అంటే మురిపెమే కాదు..! పెద్ద వ్యాపారం కూడా..!!
ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో 46 లక్షల వివాహాలతోపాటు రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని నివేదికలు పేర్కొంటున్నాయి.

దిశ, ఫీచర్స్ : ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది అన్నట్లు.. దేశ వ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది జంటలు ఎదురు చూస్తున్న పెళ్లిళ్ల సీజన్ నేడే తలుపు తట్టింది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 14 వరకు ఇది కొనసాగనుంది. ముఖ్యంగా భారత దేశానికే ప్రత్యేక సందర్భం. ఎందుకంటే ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఈ సీజన్‌కి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాయి. కాగా ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో 46 లక్షల వివాహాలతోపాటు రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఆ వివరాలేమిటో చూద్దాం.
* కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) రీసెర్చ్ & ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ (CRTDS) నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 14 వరకు కొనసాగే భారతీయ పెళ్లిళ్ల సీజన్ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరటనివ్వనుంది.
*2024లో ఇదే సీజన్‌లో 48 లక్షల పెళ్లిళ్లు జరుగగా, రూ. 5.9 లక్షల కోట్ల వ్యాపారం వాటి పేరుతో జరిగింది. అంతకు ముందు సంవత్సరం, అంటే.. 2023లో 38 లక్షల వివాహాలు కాగా, రూ. 4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈసారి పెరిగిన సంఖ్యలు దేశీయ వాణిజ్యం, స్వదేశీ ఉత్పత్తులపై ప్రజల ఆసక్తికి అద్దం పడుతున్నాయి.
ఏ రంగం నుంచి ఎంత శాతం?
ఈ పెళ్లిళ్ల సీజన్‌లో వివిధ రంగాలు, ప్రభుత్వ ఆదాయానికి రూ. 75,000 కోట్ల మేర లాభం చేకూర్చనున్నాయి. ముఖ్యంగా రత్నాలు అలాగే ఆభరణాలు(Gems and jewelry) (15%), దుస్తులు, సారీలు (10%), క్యాటరింగ్ (10%), ఈవెంట్ మేనేజ్‌మెంట్ (5%), ఎలక్ట్రానిక్స్ (5%), డ్రై ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ (5%), గ్రాసరీ & కూరగాయలు (5%), గిఫ్ట్ ఐటమ్స్ (4%), ఫ్లోరల్ డెకరేషన్ (4%), ట్రావెల్ & హాస్పిటాలిటీ (3%), మ్యూజికల్ గ్రూప్స్ (3%), లైట్ & సౌండ్ (3%) వంటి రంగాలు ప్రధానంగా ప్రయోజనం పొందుతాయి. ఇతర సర్వీసెస్ కూడా 3% పాటు ఆదాయ మార్గాలను సమాకూరుస్తాయి.
ఉపాధి అవకాశాలు కూడా..
పెళ్లిళ్ల సీజన్‌లో డెకరేటర్లు, క్యాటరర్లు, ఫ్లోరిస్టులు, కళాకారులు, ట్రాన్స్‌పోర్టర్లు, హాస్పిటాలిటీ సిబ్బంది వంటి వివిధ రంగాల్లో, విభాగాల్లో ఒక కోటి కంటే ఎక్కువగా తాత్కాలిక(Temporary), పార్ట్-టైమ్ (part-time) ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. జీఎస్‌టీ (GST) సంస్కరణలు, దీపావళి తర్వాత మంచి రోజులు అనే సెంటిమెంట్, స్వదేశీ ఉత్పత్తులపై పెరిగిన డిమాండ్ కూడా ఇందుకు దోహదం చేయనుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే 4.8 లక్షల పెళ్లిళ్లు జరిగి, రూ. 1.8 లక్షల కోట్ల వ్యాపారం జరుగనుందని నివేదికలు బెబుతున్నాయి. వీన్యూ(Venue), క్యాటరింగ్, హోటల్స్, జ్యువెలర్లు, ఈవెంట్ మేనేజర్లు ఇప్పటికే బుకింగ్‌లతో ఆక్రమించబడ్డాయి.
ఆర్థిక వ్యవస్థకు ఊరట..
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండెల్వాల్ వివవరణ ప్రకారం.. ‘‘భారతీయ పెళ్లిళ్ల సీజన్ దేశీయ వాణిజ్యం, స్వయం సమృద్ధి శక్తిని ప్రదర్శిస్తుంది. ఈసారి రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నివ్వడమే కాదు సాంస్కృతిక ఉత్సాహానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఏది ఏమైనా పెళ్లిళ్ల సీజన్ కేవలం మూడు ముళ్ల బంధానికి సంబంధించిన మురిపెం మాత్రమే కాదు, కోట్లాది రూపాయల వ్యాపారంతో దేశ ఆర్థిక పునరుద్ధరణకు మరింత ఊరటనిచ్చే సందర్భం కూడా. Link






