Aliens : ఆకాశం నుంచి నేలకు దిగిన వింత ఆకారం..! గ్రహాంతర‌ వాసుల పనేనా?

by Javid Pasha |

Aliens : ఆకాశం నుంచి నేలకు దిగిన వింత ఆకారం..! గ్రహాంతర‌ వాసుల పనేనా?

Aliens : ఆకాశం నుంచి నేలకు దిగిన వింత ఆకారం..! గ్రహాంతర‌ వాసుల పనేనా?
X

దిశ, ఫీచర్స్ : అంతరిక్షం, భూగోళం గురించి అనేక విషయాలు మనకు తెలిసినప్పటికీ, అంతుపట్టని రహస్యలు కూడా ఇంకెన్నో ఉండవచ్చు. అప్పుడప్పుడూ ఎదురవుతున్న పరిణామాలు, శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో సవాళ్లే ఇందుకు ఉదాహరణగా నిపుణులు పేర్కొంటారు. ముఖ్యంగా ఇతర గ్రహాలపై ఏలియన్స్ గురించిన చర్చ దశాబ్దాల నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై శాస్త్రవేత్తల్లోనూ భేదాభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. అంతుపట్టని అంశాలు, సైన్స్ ఛేదించని సైంటిఫిక్ మిస్టరీలన్నీ ఏలియన్స్(Aliens) పనే అని కూడా కొందరు అంటుంటారు. అటువంటి క్యూరియాసిటీని పెంచే న్యూస్ ఒకటి ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్గాం.

అది 2025, మార్చి 26వ తేదీ. కొలంబియాలోని బుగా పట్టణంలో ఆకాశం నుంచి భూమిపైకి ఒక రహస్యమైన లోహ గోళం(Mysterious metal sphere) దిగింది. స్థానిక సాక్షులు, ముఖ్యంగా మారియా అనే యువతి, మరో వ్యక్తి దీనిని గమనించారు. వారి ప్రకారం ఈ గోళం అసాధారణంగా(Appearing with unusual zig-zag movements) జిగ్ - జాగ్ కదలికలతో కనిపించి, ఆ తర్వాత భూమిపై దిగినట్లు పేర్కొంటూ సంబంధిత వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా X ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ వైరల్ అయింది. జైమ్ మాస్సాన్ (Jaime Maussan), అనే ఒక ప్రముఖ మెక్సికన్ యూఎఫ్‌ఓలజిస్ట్, తన X పోస్టులలో (2025, మే 13, 14, 24, 25, 26, 27, 28, 2025 తేదీలలో) ఈ రహస్య గోళం గురించి వివరించాడు. దాని అసాధారణ లక్షణాలను (Radio frequencies, variable temperature, fiber optics, unusual aluminum alloy)పేర్కొన్నాడు. అయితే ఇవి అధికారిక శాస్త్రీయ నివేదికల కంటే ఊహాగానాలపై ఆధారపడినవిగా సైంటిస్టులు పరిగణించారు.

అయినప్పటికీ అది ఏలియన్లకు సంబంధించిన చర్యగా వార్తలు వైరల్ అవుతుండటంతో కొందరు సైంటిస్టులు ఆకాశం నుంచి కొలంబియాలోని బుగాలో దిగిన రహస్య గోళం(secret sphere)గా పేర్కొనే వస్తువును ఎక్స్-రే సాంకేతికతతో విశ్లేషించారు. కాగా ఇది మూడు లోహపు వంటి పొరలతో, 18 సమ్మితీయ మైక్రో-గోళాల(With 18 symmetrical micro-spheres)తో వెల్డింగ్ లేదా జాయింట్లు లేకుండా దాని కేంద్ర నాభి చుట్టూ అమర్చబడి ఉందని కనుగొన్నారు. దీనిని బట్టి అది మానవ నిర్మితం కాదని తెలిసినప్పటికీ, ఎలా ఏర్పడిందనేది మాత్రం ఇంకా ఛేదించని రహస్యంగానే ఉంది.

రహస్య గోళంపై రూన్స్, ఓఘమ్, మెసొపొటేమియన్ లిపులను పోలిన పురాతన చిహ్నాలు(Ancient symbols) ఉన్నాయి. AI సహాయంతో వీటిని విశ్లేషించబడినప్పుడు స్పృహ, భూమి(Consciousness, to the earth)కి సంబంధించిన తాత్విక సందేశాన్ని వ్యక్తం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా కొందరు పరిశోధకులు ఇదొక కళాఖండం(Extensive artwork) కావచ్చని ఊహిస్తున్నప్పటికీ, దాని ప్రత్యేక నిర్మాణం, రహస్యమైన మూలాలు(Mysterious sources) శాస్త్రవేత్తలను, ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అయితే చాలామంది అది గ్రహాంతర వాసుల పని అని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Next Story