- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Technology : హ్యూమన్ డైవర్లకు గుడ్‌బై.. నీటిలోని నిర్మాణాలను కాపాడే AI రోబోస్ వచ్చేశాయ్‌గా..!
రిమోట్ ఆపరేటెడ్ రోబోటిక్స్ ద్వారా వంతెనలు, వివిధ నిర్మాణాల్లో పగుళ్లు, కోతలు, స్ట్రక్చరల్ వీక్‌నెస్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు.

దిశ, ఫీచర్స్ : ఏఐ ఆధారిత రోబోటిక్ టెక్నాలజీ వల్ల ప్రస్తుతం అనేక పనులను సులభతరం అవుతున్నాయి. ప్రమాదకరమైన పనుల్లో సైతం మానవులకు రిస్క్ తగ్గుతోంది. మనుషులు చేయలేని పలురకాల పనులను, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం సమర్థవంతంగా నెరవేర్చగల అవకాశం ఆధునిక సాంకేతికత ద్వారా ఏర్పడింది. అలాంటి వాటిలో రోమోట్లీ ఆపరేటర్ రోబోటిక్ వెహికల్స్ (Remotely Operated Robotic Vehicles - RORV) కూడా ఒకటి. ఇటీవల వీటికి ఏఐ తోడు కావడంతో ఆయా పనుల్లో మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునే వీలు ఏర్పడుతోందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నదులు, కాలువలు, సముద్రాలలోని వంతెనల భద్రతా పర్యవేక్షణలో, మరమ్మతుల్లో ఇవి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అండర్ వాటర్ రోబోటిక్ టెక్నాలజీ అని కూడా పిలుస్తున్నారు.
ఎలా ఉపయోగపడుతాయి?
ఇటీవలి కాలంలో నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (NFR) సైతం.. రైల్వే బ్రిడ్జ్‌ల భద్రతను మెరుగుపరచడానికి అధునాతన అండర్‌వాటర్ రోబోటిక్ వాహనాలను (Remotely Operated Robotic Vehicles - RORV) ఉపయోగించడం ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా రైల్వే బ్రిడ్జిలు, నదులపై వంతెనలు, ఫ్లై ఓవర్ల నిర్వహణలో ఇటీవల ఈ రోబోటిక్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోబోట్లు నీటి అడుగున ఉండే బ్రిడ్జ్ ఫౌండేషన్లు, పియర్లు, రివర్‌బెడ్ వంటి భాగాలను సులభంగా, సురక్షితంగా పరిశీలించే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు ఏఐ ఆధారంగా స్వయంచాలకంగా పనిచేస్తాయి. గతంలో మానవ డైవర్ల ద్వారా మాత్రమే బ్రిడ్జ్ ఫౌండేషన్లు, పియర్లు, రివర్‌బెడ్ వంటి పనులు చేయాల్సి వచ్చేంది. పైగా ఇది కష్టంగా లేదా ప్రమాదకరంగా ఉండేది. కానీ ఇప్పుడు రోమోట్లీ ఆపరేటర్ రోబోటిక్ వెహికల్స్ లేదా రోబోస్ వల్ల ఇది చాలా సులభం. పైగా ఆయా వాతావరణ పరిస్థితుల్లో, నీటి ప్రవాహాల్లో సైతం ఇవి అధిక రిజల్యూషన్ వీడియోలు, చిత్రాలను క్యాప్చర్ చేయడం, తద్వారా ఏఐ మోడల్స్ ఆధారంగా లోపాలను గుర్తించడం, కచ్చితంగా సరిచేయడం వంటివి చేస్తున్నాయి.
ఏయే పనుల్లో..
రిమోట్ ఆపరేటెడ్ రోబోటిక్స్ ద్వారా వంతెనలు, వివిధ నిర్మాణాల్లో పగుళ్లు, కోతలు(Cracks &Erosion), స్ట్రక్చరల్ వీక్‌నెస్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. చిన్న చిన్న మరమ్మతులను వాటి ద్వారానే పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా ఇవి వివిధ అండర్ వాటర్ బ్రిడ్జ్‌లు, బలమైన నదీ ప్రవాహాలు, భారీ వరదలు, నిరంతరం నీటిలో మునిగి ఉండే పరిస్థితుల్లో సులభంగా పనిచేయగల సాంకేతిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ టెక్నాలజీ ఎంతో ముఖ్యమైనది. ఇటీవలి బ్రహ్మపుత్ర నదిపై ఉన్న భారతదేశంలోనే 1.45 కి.మీ. పొడవు గల మొదటి రైల్-కమ్-రోడ్ బ్రిడ్జ్ అయిన సరైఘాట్ బ్రిడ్జ్‌ని కూడా RORV సాయంతో సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు. వీటిని బ్లూ రోబోటిక్స్ (Blue Robotics), డీప్ ఓషియాన్ ఇంజినీరొంగ్ (Deep Ocean Engineering), బాక్స్‌ఫిష్ (Boxfish Robotics) వంటి అంతర్జాతీయ కంపెనీలు తయారు చేస్తున్నాయి.
ఎక్కడ ఉపయోగిస్తారు?
అండర్‌వాటర్ రోబోటిక్ టెక్నాలజీని ఆయిల్ & గ్యాస్ ఇండస్ట్రీస్, సబ్‌సీ పైప్‌లైన్లు, ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫామ్‌లలో ఉపయోగిస్తారు. అలాగే నావల్/మిలిటరీల్లో భద్రతా పర్యవేక్షణకు, మైన్ డిటెక్షన్ కోసం, సెర్చ్ & రెస్క్యూ, షిప్ హల్ ఇన్‌స్పెక్షన్ కోసం, సముద్ర అధ్యయనానికి, శిథిలాల అన్వేషణకు, పరిశీలనకు, నీటి అడుగుభాగంలో పరిశోధనలకు ఉపయోగిస్తారు. అలాగే డ్యామ్‌లు, పోర్ట్‌లు, బ్రిడ్జ్‌లు, వాటర్ ట్యాంక్‌లు నిర్వహణలో లోపాలను, భద్రతను గుర్తించడానికి, పరిశీలించడానికి రిమోట్లీ ఆపరేటెడ్ రోబోటిక్ వాహనాలను(Remotely Operated Robotic Vehicles - RORV)ఉపయోగిస్తారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇవి వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. ఈ టెక్నాలజీని భారత రైల్వేలాంటి సంస్థలు ఇప్పటికే ఉపయోగించుకుంటున్నాయి.
ప్రధాన ప్రయోజనాలు
* మానవ డైవర్లకు ప్రమాదం లేకుండా లోతైన/ప్రవాహం బలంగా ఉన్న నీటిలో పని చేయడం సాధ్యం అవుతుంది.
*హ్యూమన్ డైవర్లకంటే ఎక్కువ సమయం పనిచేస్తాయి
*హై క్వాలిటీ ఇమేజెస్, రియల్-టైమ్ డేటా సేకరణలో కీ రోల్ పోషిస్తాయి.
*వంతెనలు, రైల్వే బ్రిడ్జిల పర్యవేక్షణలో ఖర్చు తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది
*పర్యావరణ రిస్క్ తక్కువ, సురక్షితమైన మెయింటెనెన్స్ ఎక్కువ






