- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిద్రలేమి వేధిస్తోందా..? పడుకోవడానికి గంటముందు ఫోన్ చూడటం మానేయండి!
స్క్రీన్ టైమ్ తగ్గితే మెలటోనిన్ సహజంగానే రిలీజ్ అవుతుంది. ఇది మెదడును, శరీరంలో నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. మెరుగైన నిద్రను ప్రేరేపిస్తుంది.

దిశ, ఫీచర్స్ : నిద్రలేమి(Insomnia)తో ప్రతిరోజూ ఇబ్బంది పడుతన్నారా? డోంట్ వర్రీ.. ఎందుకంటే ఈ సమస్యకు పరిష్కారం దాదాపు మీ చేతుల్లోనే ఉందంటున్నారు మానసిక, ఆరోగ్య నిపుణులు. డైలీ నిద్రకు ఒక గంట ముందు మొబైల్, టీవీ, ల్యాప్ టాప్ వంటి స్క్రీన్లను పూర్తిగా అవాయిడ్ చేస్తే ఇన్సోమ్నియా సమస్య 70% వరకు తగ్గుతుందని చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్, టీవీ, ల్యాప్ టాప్, డెస్క్‌టాప్.. స్క్రీన్ ఏదైనా సరే.. దాని నుంచి వెలువడే బ్లూ లైట్ మనలోని మెలటోనిన్ హార్మోన్‌ను అణచివేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఇది నిద్రహార్మోన్ కూడా.. మనం నిద్రపోవాల్సిన సమయం కాగానే “ఇప్పుడు నిద్రపోవాలి” అనే సిగ్నల్ మెదడుకు అందజేస్తుంది. కానీ తరచుగా, ముఖ్యంగా నిద్రకు ముందు స్క్రీన్‌ను చూస్తూ కూర్చుంటే ఇది సరిగ్గా రిలీజ్ అవ్వదు. మెదడుకు నిద్ర సంకేతాలను పంపదు. కాబట్టి నిద్ర రాదు. ఇదే నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. అందుకే మీరు ప్రశాంతంగా నిద్రపోవానుకుంటే.. గంట ముందు నుంచే మొబైల్ పోన్ చూడటం, ఇతర స్క్రీన్లలో మునిగిపోవడం స్టాప్ చేసేయండి అంటున్నారు నిపుణులు.
స్క్రీన్ టైమ్ తగ్గితే మెలటోనిన్ సహజంగానే రిలీజ్ అవుతుంది. ఇది మెదడును, శరీరంలో నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఫలితంగా త్వరగా నిద్రపోవడం, ఎక్కువసేపు నిద్రపోవడం పెరుగుతాయి. ఇక రాత్రిళ్లు తరచుగా మెలకువ రావడం వంటి ఇన్సోమ్నియా లక్షణాలు సైతం తగ్గుతాయి. మంచి నిద్రవల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నిద్రకు గంట ముందు స్క్రీన్ టైమ్‌ను అవాయిడ్ చేయడంవల్ల శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ (వాపు) స్థాయిలు కూడా సుమారు 30% తగ్గిపోతాయి. ఇది శరీరానికి నేచురల్ సర్కాడియన్ రిథమ్‌తో (జీవసంబంధమైన గడియారం) సరిపోలి హార్మోన్లు, కణాల మరమ్మత్తు, వాపు నియంత్రణ సక్రమంగా జరుగేందుకు దోహదపడుతుంది. దీంతోపాటు మెరుగైన నిద్ర కారణంగా రోగనిరోధక వ్యవస్థ, మెటబాలిజం మరింత ఆరోగ్యంగా ఉంటాయి. ఒక్క రాత్రి నిద్ర లోపం కూడా రోగనిరోధక వ్యవస్థను 70% వరకు బలహీన పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిద్ర ముఖ్యం. అందుకోసం స్క్రీన్ టైమ్‌ను నియంత్రించడం కూడా చాలా ముఖ్యం.






