ఈ వంటింటి చిట్కాలతో నోటిపూతను తగ్గించుకోండి!

by Disha Web Desk 10 |
ఈ వంటింటి చిట్కాలతో నోటిపూతను తగ్గించుకోండి!
X

దిశ, వెబ్ డెస్క్ : నోటిపూత వల్ల మనం తినడానికి, తాగడానికి అనేక రకాలు ఇబ్బందులు పడుతూ ఉంటాము. నోటి పూత వచ్చినప్పుడు కొంత మందికి జ్వరం కూడా వస్తుంది. మరి ఈ నోటిపూతను వంటింటి చిట్కాలతో ఎలా పోగొట్టుకోవాలో ఇక్కడ చూద్దాం.. తులసి మొక్కలు ప్రతి ఇంట్లో దొరుకుతాయి. ఈ ఆకుల్లో ఒకటి కాదు.. రెండు కాదు అనేక రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి మనకి ఉపశమనం కలిగిస్తాయి. తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నోటి పూతల నుంచి మనల్ని రక్షిస్తాయి. ఇలాంటి సమస్యలతో ఎక్కువ ఇబ్బంది పడే వారు బాధపడేవారు రోజూ ఒక చెంచా గసగసాలు తీసుకోని, వాటిని గోరువెచ్చని నీటితో ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.

Also Read... Neem: వేపాకు వల్ల వీటికి చెక్ పెట్టొచ్చని తెలుసా?



Next Story

Most Viewed