గుర్తింపు.. ఓ భ్రమ!!(కళ్లు తెరిపించే కథ)

by Sujitha Rachapalli |   (  Updated:2025-02-25 11:49:32  IST  )

మనం చేసిన పనికి ఇతరులు చప్పట్లు కొట్టడం, ప్రశంసలు కురిపించడం.. ‘‘గుర్తింపు’’ కిందకు వస్తుంది. దీన్ని బాహ్య ధ్రువీకరణగా చెప్తారు పెద్దలు. అయితే ఈ గుర్తింపు అనేది ఒక ‘‘భ్రమ’’ అని.. దీని నుంచి అహం పుట్టుకొస్తుందని,

గుర్తింపు.. ఓ భ్రమ!!(కళ్లు తెరిపించే కథ)
X

దిశ, ఫీచర్స్ : మనం చేసిన పనికి ఇతరులు చప్పట్లు కొట్టడం, ప్రశంసలు కురిపించడం.. ‘‘గుర్తింపు’’ కిందకు వస్తుంది. దీన్ని బాహ్య ధ్రువీకరణగా చెప్తారు పెద్దలు. అయితే ఈ గుర్తింపు అనేది ఒక ‘‘భ్రమ’’ అని.. దీని నుంచి అహం పుట్టుకొస్తుందని, ఇలాంటి ఇగోను పెంచే సక్సెస్ ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. రికగ్నైషన్ ఒక్కోసారి అధిక అంచనాలకు దారితీసి.. అలాంటి వాలిడేషన్ మళ్లీ లభించకపోవచ్చు. అంతర్గత అశాంతికి దారితీయొచ్చు. ఆమోదం పొందాలనుకునే చక్రంలో చిక్కిపోయి.. మనల్ని మనం విముక్తి చేసుకునేందుకు జీవితకాలం పట్టొచ్చు. అందుకే రియాలిటీ చెక్ చేసుకోవాలంటున్న నిపుణులు.. అసలు శాంతి ఎందులో దొరుకుతుందో సూచిస్తున్నారు.

హలో బాస్.. ఒక్క క్షణం.. నువ్వు ఈ మధ్య సాధించిన విజయం గురించి ఓ సారి గుర్తుచేసుకో. నిజంగా ఆ సక్సెస్ ఆస్వాదించారా? లేక ఇతరుల లైక్స్, షేర్స్, గుర్తింపుతో కూడిన ఈ ప్రపంచంలో క్లాప్స్, అప్లాజ్, అవార్డు అసలైన రివార్డు అనుకుని పొంగిపోయారా? కానీ ఆ చప్పట్లు ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుంది? గుర్తింపు అనే ఈ భ్రమ మన మనసును చీల్చుతుందా లేదా? అందుకే పని కోసమే పని చేయండి.. అది తెచ్చే చప్పట్ల కోసం కాదు. ఎవరు చూస్తున్నారనే దానితో సంబంధం లేకుండా మీరు ఏం చేయాలో అది చేయండి.

1. ఇగో శాటిస్‌ఫై కాదు

మనం గుర్తింపు కోసం ఎందుకు అంతగా పాకులాడుతాం? సమాధానం చాలా సింపుల్.. అహం ఇతరుల అటెన్షన్‌ను బట్టి వృద్ధి చెందుతుంది. మనం ఎంత ఎక్కువ వాలిడేషన్ పొందుతామో.. అంత ఎక్కువగా మన సెల్ఫ్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. కానీ అసలు విషయం ఏంటంటే.. మన ఇగో ఎప్పుడూ శాటిస్‌ఫై కాదు. మీరు నెక్స్ట్ సక్సెస్ సాధించినప్పుడు.. ఇప్పటి కంటే ఎక్కువ ప్రశంసలు రావాలని కోరుకుంటారు. అవి అందకపోతే, మునుపటి గుర్తింపు లభించకపోతే.. మీకు మీరే వాల్యూలెస్‌గా కనిపిస్తారు. మీ విలువను ప్రశ్నించుకుంటారు. అందుకే ఆ అహాన్ని పెంచి పోషించడం ఆపండి. విజయం ఎవరు చూస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందనే భ్రమ నుంచి బయటపడండి. ప్రపంచం ప్రశంసిస్తున్నదని కాకుండా మీకు నచ్చినందుకు, మీరు మెచ్చే పని చేయండి.

2. సక్సెస్.. ఓ గేమ్

మీరు చేసే పనికి ప్రతిఫలాన్ని ఆశిస్తూ.. ఆ వర్క్ సక్సెస్ అయ్యేందుకు మీరు చేయాల్సిందానకన్నా ఎక్కువ చేశారు అనుకుందాం. కానీ అన్ని బెస్ట్ ఇచ్చినా... మీకు కాకుండా మరొకరికి ఆ క్రెడిట్ వెళ్లిందనుకుందాం. ప్రపంచం ముందుకు సాగకుండా ఉంటుందా? అందుకే సక్సెస్, ఫెయిల్యూర్ తాత్కాలికమని గుర్తుంచుకోండి. మీ ప్రయత్నాలు మిమ్మల్ని డిఫైన్ చేస్తాయి కానీ ఈ సక్సెస్ అనే గేమ్ కాదు. ఇతరుల గుర్తింపు కోసం ఆరాటపడటం మానేసి.. మీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడాన్నే ప్రథమకార్యంగా పెట్టుకున్నప్పుడు.. అపజయాలను యాక్సెప్ట్ చేసేందుకు భయపడకుండా ఉంటారు. అదే రియల్ పవర్ కూడా.

3. ఆమోదం అవసరమా?

చాలా మంది సొసైటీకి ఆమోదయోగ్యంగా ఉంటుంది కాబట్టి ఓ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇతరుల గుర్తింపు కోసం పర్సనల్ చాయిస్ వదిలేస్తారు. కానీ వాళ్లకు నచ్చనంత మాత్రానా మనం వెళ్లే మార్గం ముఖ్యమైనది కాదని ఎలా డిసైడ్ చేస్తారు? మీ ఉద్దేశం నిజాయితీగా ఉంటే మీరు ఇప్పటికే విజయం సాధించినట్లు. మీకు నచ్చకపోయినా ఇతరుల దారిలో వెళ్లి విజయం సాధించడం కన్నా మీ సొంత మార్గంలో వెళ్లి విఫలమవడం మంచిది. అదే మనసుకు హాయిని ఇస్తుంది కూడా. ఎవరి ఆమోదం కోసం వేచి చూడకుండా కృషి చేయండి. అప్పుడే మీరు గుర్తింపు మీద కాకుండా కేవలం మీరు చేసే పని మీదే కాన్సంట్రేట్ చేయగలరు.

4. జ్ఞానమే శాశ్వతం

మీరెప్పుడైనా గమనించారా? జనం గొప్ప విజయాలను కూడా చాలా త్వరగా మరిచిపోతారు. ఈ క్షణం ఒకరు లైమ్‌ లైట్‌లో ఉంటే.. రేపు మరొకరు వెలుగులోకి రావచ్చు. అందుకే గుర్తింపు కంటే జ్ఞానం ముఖ్యం. కీర్తి మసకబారిపోవడం సాధారణమే. స్వీయ అవగాహన, అంతర్గత శాంతిపై పెట్టుబడి పెడితే.. ఒకరి వాలిడేషన్ లేకుండా మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని శాశ్వతంగా సంతోషంగా ఉంటారు. జ్ఞాని ఆవు, కుక్క, ఏనుగు, పండితుడు, పామరుడు.. ఇలా అన్ని జీవులను సమానదృష్టితో చూడగలడు. ఆనందంగా ఉండగలడు.

Next Story