ఇంట్లో అవే.. బయట కూడా అవే.. అథ్లెజర్ ఫ్యాషన్‌పై యువత ఆసక్తి!

by Javid Pasha |   (  Updated:2025-12-10 12:37:31  IST  )

ఈ మధ్య సెలబ్రిటీలంతా ఇంట్లో, బయట కెమెరాల ముందు కూడా ‘స్వెట్స్‌’లోనే ఎక్కువగా దర్శనమిస్తున్నారు. యువతలో అథ్లెజర్ ట్రెండ్‌పై ఆసక్తి పెరుగుతోంది.

ఇంట్లో అవే.. బయట కూడా అవే.. అథ్లెజర్ ఫ్యాషన్‌పై యువత ఆసక్తి!
X

దిశ, ఫీచర్స్ : మారుతున్న పరిస్థితులకు, అప్పటి అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఫ్యాషన్లు పుట్టుకొస్తుంటాయి. ముఖ్యంగా వస్త్ర ధారణలో సౌందర్యం, సౌకర్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు చాలామంది. ఈ క్రమంలో తెరమీదకొచ్చిన కొత్త ట్రెండే అథ్లెజర్ (Athleisure). యువతీ యువకులు ఈ ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు కూడా ప్రస్తుతం ఎక్కువగా స్వెట్స్‌(Sweats)లోనే దర్శనమిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఇంట్లో ఉన్నప్పుడో, గ్రౌండ్‌లో వాకింగ్ చేస్తున్నప్పుడో, జీమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నప్పుడో, క్రీడల్లో పాల్గొన్నప్పుడో మాత్రమే ధరించే సౌంకర్యవంతమైన దుస్తులను ప్రస్తుతం ప్రయాణాల్లో, వెకేషన్లలో, ఈవెంట్లలో కూడా ధరిస్తున్నారు. పైగా అదో అట్రాక్టివ్ ట్రెండ్‌గా మారిపోయింది.

అథ్లెజర్ అంటే “అథ్‌లెటిక్ + లిజర్” (Sports + Leisure) ఈ క్రీడ, విశ్రాంతి కలయికల డ్రెస్సింగ్‌ స్టైల్‌ను అతి సోమరితనం లేదా అతి గొప్ప విషయంగా(Too lazy or too great a thing) రెండూ కలిపి కలిపి చెప్పవచ్చు! ఏది ఏమైనా ఈ అథ్లెజర్ ఫ్యాషన్ ట్రెండ్‌ను ఇటీవల అందరూ ఆరాధిస్తున్నారు. ట్రాక్ ప్యాంట్స్, లెగ్గింగ్స్, హూడీలు, స్పోర్ట్స్ బ్రా, జాగర్స్, జిప్-అప్ జాకెట్స్ వంటి దుస్తులు ఇప్పుడు కేవలం జిమ్‌కో లేదా ఇంటికో పరిమితం కాదు, రోడ్డు మీద, షాపింగ్‌కి, కాఫీ షాప్‌కి, హ్యాంగ్‌ అవుట్‌కి కూడా బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. ఈ దుస్తులు ఒక్కసారిగా కంఫర్ట్ అండ్ స్టైల్‌ రెండింటినీ ఇస్తాయి కాబట్టి, ప్రపంచంలోని అత్యంత స్టైలిష్ సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.

ఇంతకు ముందు ఇంట్లో ఉన్నప్పుడు ధరించే లూజ్ క్లాతింగ్స్ ఇప్పుడు రెడ్ కార్పెట్ స్థాయి ఫ్యాషన్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. హాలీవుడ్ నటులు, సింగర్స్, మోడల్స్ అందరూ ఎయిర్‌పోర్ట్ లుక్ నుంచి కెమెరా ముందు స్టిల్స్ వరకు ఈ కంఫర్టబుల్ లుక్‌నే ఎంచుకుంటున్నారు. ఈ ట్రెండ్‌ను మొదట ఎవరు పాపులర్ చేశారో కచ్చితంగా చెప్పలేం కానీ, ప్రజెంట్ ఆధునిక ఫ్యాషన్ పోకడలను అనుసరించే యువతీ యువకులు, ముఖ్యంగా మహిళల వార్డ్‌రోబ్‌లో అతి ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఇందులో కంఫర్ట్‌తో పాటు స్టైలిష్‌ లుక్స్ కలగలిసినందును అందరికీ నచ్చుతోంది.

అథ్లెజర్ ట్రెండ్ చరిత్ర

*1970 –1980: మొదటి అడుగులు యోగా, ఏరోబిక్స్, జాగింగ్ ట్రెండ్ మొదలైంది. ఈ సమయంలో లెగ్గింగ్స్, ట్రాక్‌సూట్స్, స్వెట్‌షర్ట్స్ మొదటిసారిగా జిమ్ బయట కనిపించాయి. జేన్ ఫోండా (Jane Fonda) తన ఏరోబిక్స్ వీడియోల్లో లెగ్గింగ్స్ + లియోటార్డ్ ధరించి దీన్ని పాపులర్ చేసింది.

*1990 : హిప్-హాప్ & స్ట్రీట్ వేర్ ప్రభావం అడిడాస్ ట్రాక్‌సూట్స్(Adidas tracksuits), నైకి షూస్, చాంపియన్ హూడీలు హిప్-హాప్ ఆర్టిస్టులు (Run-DMC, TLC, Salt-N-Pepa) ధరించడంతో రోడ్డుపై ఫ్యాషన్‌గా మారాయి.

*2000–2010: లులులెమన్ (Lululemon) రాక, 1998లో కెనడాలో లులులెమన్ బ్రాండ్ పుట్టింది.

*2005–2010 మధ్య యోగా ప్యాంట్స్‌ను ‘ఎవరైనా ఎక్కడైనా ధరించవచ్చు’ అనే ఆలోచనతో మార్కెట్‌లోకి తెచ్చారు. ఇక్కడి నుంచే అథ్లెజర్ అనే అఫీషియల్‌గా వాడుకలోకి వచ్చింది.

*2014–2016: పెద్ద బ్రేక్‌త్రూ వోగ్, ఎల్లె మ్యాగజైన్స్ “Athleisure”ని అధికారిక ఫ్యాషన్ ట్రెండ్‌గా ప్రకటించాయి. జిజి హదీద్, కెండల్ జెన్నర్, హైలీ బాల్డ్‌విన్ లెగ్గింగ్స్ + క్రాప్ టాప్ + స్నీకర్స్ లుక్‌తో ఎయిర్‌పోర్ట్ ఫ్యాషన్‌ను మార్చేశారు. అడిడాస్ స్టాన్ స్మిత్, నైకి ఎయిర్ ఫోర్స్ షూస్ మళ్లీ ట్రెండ్ అయ్యాయి.

*2017–2020: గ్లోబల్ డామినెన్స్ బాలెన్‌సియాగా(Balenciaga), గుచ్చి(Gucci), ప్రాడా(Prada) వంటి లగ్జరీ బ్రాండ్స్ కూడా ట్రిపుల్ స్ట్రైప్ ట్రాక్ ప్యాంట్స్, ఓవర్‌సైజ్ హూడీలు(oodies) రిలీజ్ చేశాయి. బియాన్సే, రిహాన్నా, కిమ్ కర్దాషియాన్ తమ సొంత అథ్లెజర్ లైన్స్ (Ivy Park, Fenty, Skims) లాంచ్ చేశారు.

*2020–2025 కోవిడ్ సమయంలో ముఖ్యంగా లాక్‌డౌన్‌లో అందరూ ఇంట్లోనే ఉండడంతో ట్రాక్ ప్యాంట్స్, హూడీలు, లెగ్గింగ్స్ ఆల్మోస్ట్ “యూనిఫాం” అయిపోయాయి. అందరూ వాటికి అలవాటు పడ్డారు. ఇంకేముందు ఇంట్లో ధరించినవే ఇప్పుడు బయట కూడా ధరిస్తున్నారు. ఆఫీసుకు కూడా “స్మార్ట్ అథ్లెజర్” (బ్లేజర్ + లెగ్గింగ్స్ + స్నీకర్స్) ధరిస్తున్నారు. ఈ అథ్లెజర్ ట్రెండ్ ఇప్పుడు కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, జీవనశైలిలో భాగమైపోయింది.

Next Story