- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమానంలో వెళ్తే ఒక కాయను అస్సలే తీసుకెళ్లకూడదంట.. అది ఏమిటో మీకు తెలుసా?
ఫ్లైట్‌లో జర్నీ చేయాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఫ్లైట్‌లో వెళ్తే చాలా హ్యప్పీగా కూడా అనిపిస్తుంటుంది. అయితే కొంత మంది ఇండియా నుండి వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు చాలా సామాను తీసుకెళ్తారు. మరీ ముఖ్యంగా

దిశ, ఫీచర్స్ : ఫ్లైట్‌లో జర్నీ చేయాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఫ్లైట్‌లో వెళ్తే చాలా హ్యప్పీగా కూడా అనిపిస్తుంటుంది. అయితే కొంత మంది ఇండియా నుండి వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు చాలా సామాను తీసుకెళ్తారు. మరీ ముఖ్యంగా మన వారికి కాస్త భక్తి ఎక్కువ. కొత్తగా ఇంట్లోకి వెళ్తున్నామని లేదా, వేరే దేశంలోకి అడుగు పెడుతున్నాం కదా.. అక్కడ కొబ్బరికాయలు దొరుకుతాయో లేదో ఒకటి తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి అడుగుపెడుదాం అని కొందరు ఆలోచిస్తుంటారు.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఫ్లైట్‌లో వెళ్లేటప్పుడు ఒక కాయను తీసుకెళ్లడానికి అనుమతినివ్వరు. అదే కొబ్బరికాయ. అవును విమానంలో వెళ్లే సమయంలో కొబ్బరికాయను తీసుకెళ్లనివ్వరంట. ఎందుకంటే? కొబ్బరికాయలకు చాల మండే గుణం ఉండటం కారణంగా దీనిని విమానాల్లో తీసుకెళ్లడానికి అనుమతి లేదంట. విమానయాన నిబంధనలు, భద్రతా చర్యలు, ప్రయాణికులు , సిబ్బంది భద్రత దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేంజరస్ గూడ్స్ నిబంధనల ప్రకారం ఎండిన కొబ్బరిని విమానంలోకి అనుమతించదంట. ఎందుకంటే పర్యావరణానికి హానికలిగించే వాటిలో ఈ ఎండు కొబ్బరి ఒకటి. దీనికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే దీని వలన ఫ్లైట్‌లో ఇతర పదార్థాలు చెడిపోవడం, ఇది త్వరగా పాడైపోయి, విమానంలో అపరిశుభ్రత వాతావరణాన్ని సృష్టిస్తుందంట. వీటన్నింటి వలన కొబ్బరిని ఫ్లైట్‌లో తీసుకెళ్లడానికి పర్మిషన్ లేదు అంటున్నారు నిపుణులు.






