- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Real Estate : సొంతింటి కల.. నెరవేర్చుకోండిలా.. భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
Real Estate : సొంతింటి కల.. నెరవేర్చుకోండిలా.. భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు

దిశ, మేడ్చల్ బ్యూరో : నగర శివారు ప్రాంతాలను కలుపుకుంటూ హైదరాబాద్ సిటీ ఇప్పుడు విశ్వనగరంగా మారబోతున్నది. తదనుగుణంగానే మహానగరం నలువైపులా రియల్ ఎస్టేట్ రంగం వినూత్న మార్పులు చేసుకుంటూ మధ్య, ఎగువ తరగతుల వారికి సొంత ఇంటి కలపై మారుతున్న అభిరుచికి అనుగుణంగా సొంతిల్లు సాకారం అయ్యేలా నిర్మాణాలు చేపట్టాయి. స్థానిక కన్ స్ట్రక్షన్ కంపెనీ మొదలుకొని పలు రాష్ట్రాలకు చెందిన కార్పొరేట్ నిర్మాణ సంస్థలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పోటీ పడుతున్నాయి. నిర్మాణ సంస్థ పెద్దదైనా.. చిన్నదైనా మధ్యతరగతి వారిని ఆకర్షించే విధంగా పనులు చేపట్టడమే కాకుండా ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి.
విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ నగరం నలువైపులా అభివృద్ధి పరుగులు తీస్తుంది. రీజినల్ రింగ్ రోడ్, ఐటీ కారిడార్ విస్తరణ, ఫార్మా విలేజ్, మెట్రో రైల్ రెండవ దశ పనులు, ఎలివేటెడ్ కారిడార్ తదితర అభివృద్ధి పనులు ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తున్నాయి. అదే స్థాయిలో ఓపెన్ ప్లాట్స్, నివాస గృహాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లు భారీగానే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో గచ్చిబౌలి, నానక్ రామ్ గూడా, శేరిలింగంపల్లి, మియాపూర్, బాచుపల్లి, గుండ్ల పోచంపల్లి, గండి మైసమ్మ, ఉప్పల్, ఎల్బీనగర్, చింతలకుంట తదితర ప్రాంతాలలో గేటెడ్ కమ్యూనిటీ, హైరైస్ బిల్డింగ్ నిర్మాణాలతో పాటుగా ఓపెన్ ప్లాట్స్ క్రయవిక్రయాలు భారీగానే జరుగుతున్నాయి.
లోకల్ టు కార్పొరేట్
వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులకు తోడుగా రియల్ ఎస్టేట్ రంగంలో స్థానిక నిర్మాణ సంస్థలతో పాటుగా పలు రాష్ట్రాలకు చెందిన కార్పొరేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. క్రితం వరకు ఉండటానికి ఇల్లు ఉంటే చాలు అని భావించే మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు సొంత ఇల్లు ఇంత విస్తీర్ణంలో ఉండాలి. ఇన్ని రూములు ఉండాలి. ఈ విధంగా ఫర్నిచర్ చేయించుకోవాలి అనే ఆలోచనతో ఉంటున్నారు. వీరి ఆలోచనలకు అనుగుణంగానే ఎవరికి వారు మార్కెటింగ్ టెక్నిక్స్ తో మధ్యతరగతి వారిని ఆకట్టుకునే విధంగా అపార్ట్ మెంట్స్, ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ లను నిర్మించి ఇస్తామని ప్రకటనలు, ఆఫర్లు ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఆఫర్లతో జాగ్రత్త
సొంత ఇంటిపై ఆశగా ఉన్న వారికి నిర్మాణ సంస్థలు ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేయటం సహజమే. అయితే ఈ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని లేనిపక్షంలో మోసపోవటం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రీ లాంచింగ్ ఆఫర్లు పేరిట బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా డబ్బులు తీసుకొని సంవత్సరాలుగా నిర్మాణాలు చేస్తుండటం, కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేయటం వంటివి జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.






