Eye health : కళ్లు మసకబారుతున్నాయా..? మీరు తప్పక తీసుకోవాల్సిన 5 ఆహారాలివే..

by Javid Pasha |   (  Updated:2025-07-23 07:49:10  IST  )

Eye health : కళ్లు మసకబారుతున్నాయా..? మీరు తప్పక తీసుకోవాల్సిన 5 ఆహారాలివే..

Eye health : కళ్లు మసకబారుతున్నాయా..? మీరు తప్పక తీసుకోవాల్సిన 5 ఆహారాలివే..
X

దిశ, ఫీచర్స్ : కళ్లు తరచుగా మసక బారుతున్నాయా..? అయితే అది పోషకాహార లోపం వల్ల కూడా కావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే తీసుకునే ఆహారం ద్వారా లభించే ఖనిజాలు, విటమిన్లు కంటిచూపును సహజమైన మార్గాలలో మెరుగు పరుస్తుంటాయి. దీర్ఘకాలంపాటు ఇవి అందకపోతే చూపు మందగించే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. వీటిని నివారించడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

*క్యారెట్ : క్యారెట్‌లు కంటి ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారంగా నిపుణులు పేర్కొంటారు. ఎందుకంటే వీటిలో కంటి ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఎ, బీటా-కెరోటిన్‌లో సమృద్ధిగా ఉంటాయి. బీటా-కెరోటిన్ అనేది శరీరంలో విటమిన్ ఎగా మారి, రెటినాలోని రోడోప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉత్పత్తికి సహాయపడుతుంది. తక్కువ వెలుతురులో కూడా చూడడానికి ఇది చాలా అవసరం. అంతేకాకుండా క్యారెట్‌లు కంటి పొరలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రాత్రిపూట సరిగ్గా కనబడకపోవడం(Night blindness) వంటి సమస్యలను దూరం చేస్తాయి. క్యారెట్లనుపచ్చిగా కానీ, ఉడికించి కానీ తినవచ్చు. సలాడ్‌లలో చేర్చి తినవచ్చ. ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు మొత్తం ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.

*ఆకుపచ్చ కూరగాయలు : పాలకూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయల్లో సహజంగానే లుటీన్ అండ్ జీయాక్సాన్‌థిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లను ఉంటాయి. ఇవి కంటి రెటినాను హానికరమైన బ్లూ లైటింగ్ నుంచి, అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ (AMD), అండ్ కంటిశుక్లం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది కంటి రక్తనాళాలను బలోపేతం చేస్తుంది. ఈ కూరగాయలను స్మూతీలు, సలాడ్‌లు లేదా తేలికగా వండిన వంటకాలలో చేర్చడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

*సాల్మన్ చేప : సాల్మన్ వంటి ఫ్యాటీ ఫిష్‌లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరం. అంతేకాకుండా రెటినా పనితీరును మెరుగుపరుస్తాయి. కళ్లల్లో నీరు కారడ, పొడిబారడం (Dry eye syndrome) వంటి సమస్యల నివారణలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా కంటి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, వాపును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. సాల్మన్‌ చేపలను గ్రిల్ చేసి, బేక్ చేసి, లేదా సూప్‌లలో చేర్చి తినవచ్చు. ఇతర ఒమేగా-3 సమృద్ధిగా ఉండే ఇతర చేపలలో ట్యూనా అండ్ సార్డిన్‌లు కూడా ఉన్నాయి. ఇవి కూడా కంటి చూపును మెరుగు పరుస్తాయి.

*గుడ్డు : గుడ్డు, ముఖ్యంగా గుడ్డు సొన కంటి ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం. ఇందులో లుటీన్, జీయాక్సాన్‌థిన్ అండ్ జింక్ ఉంటాయి. ఇవి కంటిశుక్లం, రెటినా సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. గుడ్డులోని విటమిన్ ఎ కంటి ఉపరితలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.కార్నియా రక్షణలో కీ రోల్ పోషిస్తుంది. గుడ్డును ఉడకబెట్టి, ఆమ్లెట్‌గా, లేదా సలాడ్‌లలో చేర్చి తినవచ్చు. రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అంటారు పోషకాహార నిపుణులు.

*బాదం : బాదంలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది. విటమిన్ ఇ ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ రిస్క్‌ను తగ్గిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బాదంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కంటి రక్తనాళాలను బలోపేతం చేస్తాయి. అప్పుడప్పుడు లేదా రోజుకు ఒకటి చొప్పున బాదం స్నాక్‌గా తీసుకున్నా లేదా సలాడ్‌లలో చేర్చి తినడం వల్ల కూడా కంటి చూపు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక కంటి సమస్యలు నివారించబడతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story