Stress relief : తీరికలేని పనులతో తీవ్రంగా అలసిపోతున్నారా..? మీలో ఉత్సాహం నింపే టిప్స్ ఇవిగో..

by Javid Pasha |   (  Updated:2025-08-15 05:57:37  IST  )

మీలో మానసిక అలసటను దూరం చేసే అద్భుతమైన పరిష్కారాల్లో ఫిజికల్ యాక్టివిటీస్ ఒకటి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసే అలవాటు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తద్వారా ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు

Stress relief : తీరికలేని పనులతో తీవ్రంగా అలసిపోతున్నారా..? మీలో ఉత్సాహం నింపే టిప్స్ ఇవిగో..
X

దిశ, ఫీచర్స్ : పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా తీరికలేని పనులతో అసలిపోతుంటారు చాలా మంది. బిబీ బిజీగా గడుపుతూ ఒత్తిడికి లోనవుతుంటారు. దానికి తోడు ఇటు కుటుంబ బాధ్యతలు, అటు కెరీర్ పరంగా ఎదురయ్యే సవాళ్ల నడుమ సతమతం అవుతుంటారు. మోడ్రన్ డేస్‌లో ఇవన్నీ కామనే అయినప్పటికీ రోజువారీ జీవితంలో అధిక అలసట, అధిక ఒత్తిడి అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంది. క్రమంగా నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ వంటి ప్రాబ్లమ్స్ దాడిచేయవచ్చు. అలా జరగకూడదంటే.. మీ డైలీ రొటీన్స్ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే తప్పక పాటించాల్సిన చిట్కాలు కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

ఫిజికల్ యాక్టివిటీస్

మీలో మానసిక అలసటను దూరం చేసే అద్భుతమైన పరిష్కారాల్లో ఫిజికల్ యాక్టివిటీస్ ఒకటి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసే అలవాటు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తద్వారా ఆనందంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. జిమ్‌లో చేసే వర్కౌట్స్ మాత్రమే కాకుండా వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, మెడిటేషన్ వంటివి డైలీ అరగంట ప్రాక్టీస్ చేసినా బీజీ లైఫ్ నుంచి బిగ్ రిలీఫ్ పొందుతారని సూచిస్తు్న్నారు.

భావోద్వేగాల నియంత్రణ

భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం కూడా అధిక అలసటకు, ఒత్తిడికి తద్వారా ఇతర అనేక సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా కోపం, ఆవేశం, అతి ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు అధికం అవుతాయి. వాటిని అధిగమించి మీరు ఉత్సాహంగా ఉండటంలో యోగా, మెడిటేషన్, ప్రకృతిలో కాసేపు ప్రశాంతంగా గడపడం, ఇష్టమైన పుస్తకాలు చదవడం వంటివి అద్భుతంగా సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ కొంతసేపు మీకు నచ్చిన హాబీ ఫాలో అయినా మీలోని ప్రతికూల భావాలు తగ్గుతాయి. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి.

ఏకాంతంగా గడపడం

ఒంటరి తనం(Loneliness) వేరు.. ఒంటరిగా(Alone) కాసేపు గడపడం వేరు. ఒంటరి తనం మానసిక సమస్యలకు దారితీయవచ్చు. కానీ అప్పుడప్పుడు ఎవరూలేని ఏకాంత ప్రదేశంలో కాసేపు ఒంటరిగా కూర్చొని రిలాక్స్ అవ్వడం మీకు మేలు చేస్తుంది. అలా నిశ్శబ్ద వాతావరణంలో మీకు మీరు మనసులో ప్రశ్నించుకోవడం, మాట్లాడుకోవడం, లోతుగా ఆలోచించడం చేస్తారు. దీనివల్ల మీరు ఎదర్కొనే సమస్యకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఒత్తిడి, ఆందోళనలు వంటివి దూరం అవుతాయి. కాబట్టి రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే రోజూ ఉదయం లేదా సాయంకాలం కాసేపు మీకంటూ సమయం కేటాయించుకోండి. ఉదయమో, సాంయత్రమో నిశ్శబ్దంగా ప్రకృతిని ఆస్వాదించండి. దీంతోపాటు క్వాలిటీస్లీప్, సానుకూల ఆలోచనలు, కృతజ్ఞతాభావం వంటివి కూడా మీలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Next Story