- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. 80 చెరువులకు జీవం పోశాడు.!
కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి బావులు, చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించాడు

దిశ, ఫీచర్స్: ఢిల్లీకి చెందిన రామ్‌వీర్ తన్వార్ బీటెక్ పూర్తిచేసి కార్పొరేట్ ఉద్యోగంలో చేరాడు. చిన్నప్పటి నుంచి తాను చూసిన బావులు, చెరువులు శిథిలమైపోవడాన్ని చూసి.. వాటి బాగుకోసం కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి బావులు, చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించాడు.
సెల్ఫీ విత్ పాండ్
రామ్‌వీర్ 2015లో జల్ చౌపాల్ అనే ప్రచారాన్ని ప్రారంభించాడు. ఇది గ్రామస్థులతో కలిసి నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ గురించి చర్చించే వేదిక. ఈ సమావేశాల్లో చెరువుల పర్యావరణ, సామాజిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను వివరిస్తూ స్థానికులను శ్రమ, సామగ్రి, నిధుల రూపంలో భాగస్వామ్యం చేయమని ప్రోత్సహిస్తాడు. "చెరువులను పునరుద్ధరించడం కేవలం నీటిని కాపాడటం కాదు అవి జీవన వ్యవస్థలు, సమాజ కేంద్రాలు, జ్ఞాపకాలు అని చెప్తాడు. ఈ ప్రచారం ద్వారా స్థానికులను చెరువుల పునరుద్ధరణలో భాగస్వాములుగా మార్చాడు. 'సెల్ఫీ విత్ పాండ్' క్యాంపెయిన్‌తో యువతను దీంట్లో భాగస్వామ్యం చేస్తున్నాడు.
రామ్‌వీర్ సే ఎర్త్
2020లో రామ్‌వీర్ ''సే ఎర్త్'' అనే ఎన్జీఓను స్థాపించాడు. చెరువుల పునరుద్ధరణ, అర్బన్ ఫారెస్ట్‌ల సృష్టి, పర్యావరణ అవగాహనపై రామ్ సే ఎర్త్ దృష్టి సారిస్తుంది. 2025 నాటికి ఈ సంస్థ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో 80కి పైగా చెరువులను పునరుద్ధరించింది. రామ్‌వీర్ బృందం చెరువులను పునరుద్ధరించడానికి ఒక వ్యవస్థీకృత పద్ధతిని అనుసరిస్తుంది. ముందుగా చెత్త, నీటి కలుపు, ఒడ్డున ఉన్న వ్యర్థాలను తొలగిస్తారు. తర్వాత చెరువును భాగాలుగా విభజించి నీటిని ఖాళీ చేస్తారు. కాలుష్యాన్ని నిరోధించడానికి డబుల్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు.
సవాళ్లెన్నో..
ఒక చెరువు పునరుద్ధరణకు సగటున 6 నెలలు పడుతుంది. ఒక ఎకరానికి రూ. 3-5 లక్షల ఖర్చు అవుతుంది. రామ్‌వీర్ చేసిన మంచి పనివల్ల చెరువుల్లో భూగర్భ జల స్థాయిలు పెరిగాయి. జీవవైవిధ్యం మెరుగైంది. వలస పక్షులు, చేపలు, జల మొక్కలు తిరిగొచ్చాయి. సామాజిక కార్యకలాపాలు పునరుద్ధరించబడ్డాయి. గ్రామస్థులు ఈ చెరువుల చుట్టూ సాంస్కృతిక ఉత్సవాలను జరుపుకుంటున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు తగ్గాయి. స్థానికులు చెరువుల పునరుద్ధరణపై అనుమానంతో యంత్రాలపై రాళ్లు రువ్వారు. రామ్‌వీర్ సమాజంతో చర్చల ద్వారా వారి మనసు మార్చాడు.
పాండ్ వారియర్స్
చెరువుల పునరుద్ధరణతో పాటు రామ్‌వీర్ మియావాకీ టెక్నిక్ ద్వారా 50కి పైగా అర్బన్ ఫారెస్ట్‌లను సృష్టించాడు. ఇవి సాంప్రదాయ పద్ధతుల కంటే వేగంగా చెట్లను పెంచుతాయి. 2025లో అతను 100,000 మంది 'పాండ్ వారియర్స్'కు శిక్షణ ఇవ్వాలని, వారికి పర్యావరణ సంరక్షణ సాధనాలు, జ్ఞానాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దేశవ్యాప్తంగా 80కి పైగా చెరువులను పునరుద్ధరించడం ద్వారాయభూగర్భ జల స్థాయిలను మెరుగుపరిచి జీవవైవిధ్యాన్ని పెంచుతున్నాడు రామ్‌వీర్. దేశంలో నీటి కొరత, పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తున్నాడు.






