- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెల్లకోటు కష్టాలు.. ఐదోసారి ప్రయత్నంలో మాత్రం అద్భుతం.. నీట్ ర్యాంక్ కొట్టేసిన యుకుడు !
తెల్లకోటు కష్టాలు.. ఐదోసారి ప్రయత్నంలో మాత్రం అద్భుతం.. నీట్ ర్యాంక్ కొట్టేసిన యుకుడు !

దిశ తెలంగాణ బ్యూరో : నీట్ పరీక్ష ఫలితాలు వచ్చాయి. కోటి ఆశలతో.. రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులెందరో.. మా ఇంట్లోకి డాక్టర్ రాబోతున్నారని కలలు కన్న తల్లిదండ్రులు మరెందరో. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. అది జీవితం ఎందుకు అవుతుంది. కొన్నిసార్లు మన లెక్కలు తప్పుతాయి. నీట్ ఫలితాల్లో కనిపించని నంబర్ల వెనుక ఎన్నో కన్నీళ్లూ ఉంటాయి. అలాంటివారు ఒకసారి ఈ రామ్ లాల్ గురించి తెలుసుకోవాల్సిందే.
ఎవరీ రామ్ లాల్
రాజస్థాన్ లోని చిత్తోర్ ఘడ్ జిల్లా గోసుండా అనే చిన్న గ్రామానికి చెందిన రామ్ లాల్ తల్లిదండ్రులు కూలి పని చేసేవారు. అక్కడి ఆచారాల ప్రకారం 11 ఏళ్ల చిరుప్రాయంలోనే రామ్ లాల్ కి సమీప బంధువుల అమ్మాయితో వివాహం చేశారు. లోకం తెలియని వయసు ఒకవైపు... మరోవైపు కుటుంబ బాధ్యతలు.. కానీ రామ్ లాల్ మనసులో ఉన్న గాఢమైన కోరిక మాత్రం ఎప్పటికైనా తెల్లకోటు వేసుకొని డాక్టర్ గా ప్రజలకు వైద్య సేవలు అందించడం..
హేళనలు.. అవమానాలు..
నవ్వే వారు నవ్వారు.. వెక్కిరించేవారు వెక్కిరించారు.. కలలు కనడానికి కూడా హద్దు ఉండాలని హేళన చేశారు.. అయితే ఇవన్నీ రామ్ లాల్ చెవికెక్కలేదు.. పదవ తరగతిలో 74% మార్కులు సాధించాడు. కానీ తన తండ్రి పదవ తరగతి తర్వాత చదువు మానిపించి ఏదైనా పనిలో పెట్టించాలనుకున్నాడు. అటు చూస్తే ఆర్థిక పరిస్థితులు.. ఇటేమో లక్ష్యం.. అయితే రామ్ లాల్ మాత్రం లక్ష్యం వైపే అడుగులు వేశాడు. రామ్ లాల్ ఇంటి నుంచి ఉదయపూర్ పారిపోయి అక్కడ ఇంటర్ లో అడ్మిషన్ తీసుకున్నాడు. ఈసారి ఇంటర్ లో 81% మార్కులతో తన లక్ష్యానికి మరింత చేరువయ్యాడు.
ఐదోసారి.. నీట్ గా ..
రామ్ లాల్ 2019లో మొదటిసారి నీట్ పరీక్షకు హాజరయ్యాడు. అప్పుడు వచ్చిన మార్కులు కేవలం 350. ప్రతిసారి తన ప్రిపరేషన్ ని మెరుగుపరుచుకుంటూ చివరగా ఐదోసారి పరీక్షకు సన్నద్ధమయ్యడు. సరిగ్గా నీట్ పరీక్ష కి ఆరు నెలల ముందు రామ్ లాల్ భార్య పండంటి పాపకి జన్మనిచ్చింది. అటు పాప భార్యకి సంబంధించిన ఆలనా పాలన చూస్తూనే ఇటు కోచింగ్ తీసుకున్నాడు. ఎట్టకేలకు 2023 లో జరిగిన నీట్ పరీక్షల్లో 632 మార్కులతో మంచి ర్యాంకు సాధించాడు. మొత్తానికి ఐదోసారి అటెంప్ట్ లో తన కలను నెరవేర్చుకున్నాడు. తెల్లకోటు ధరించి డాక్టర్ గా తన ఊరి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు. నాడు నవ్వి.. హేళన చేసిన కుటుంబాలే నేడు నమస్తే డాక్టర్ సాబ్ అంటున్నాయి.






