- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్: రాజస్థాన్‌లోని గిరిజన ప్రాంతాల్లో ఫోరెకా అనే స్టార్టప్ కోల్డ్-ప్రెస్డ్ ఆయిల్స్ ద్వారా సుస్థిర జీవనోపాధిని సృష్టిస్తోంది. జీరో-వేస్ట్ పద్ధతులతో రైతుల జీవితాలను మెరుగుపరుస్తూ ఈ స్టార్టప్ ఒక కొత్త ఆశను రేకెత్తిస్తోంది. సత్యం భండారీ, రోహిత్ నేగి, మోహిత్ రాణా అనే ముగ్గురు స్నేహితులుచేస్తున్న కృషి ఇది.
జీవనోపాధి సృష్టి
హిమాలయాల పర్వత ప్రాంతంలోని అగస్త్యమునికి చెందిన సత్యం భండారీ పుట్టిన ఏడు రోజులకే వాళ్ల నాన్న చనిపోయాడు. తల్లి పెంచి పెద్ద చేసింది. తల్లి కష్టాలు తనను రైతుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచనకు ప్రేరేపించాయి. డెహ్రాడూన్‌లో బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత 2018-19లో గాంధీ ఫెలోషిప్‌లో చేరాడు. మధ్యప్రదేశ్‌లోని విదిశాలో పిరమల్ ఫౌండేషన్‌తో పనిచేస్తూ రైతులు, గిరిజన కమ్యూనిటీల జీవితాలను దగ్గరగా చూశాడు. ఈ అనుభవం సత్యానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఇచ్చింది. విద్య కంటే ఆహారం, గుడిసె ముఖ్యమైనవి అనుకున్నాడు. వాళ్లకు జీవనోపాధిని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఎక్కువ ధరకే..
ఫెలోషిప్ పూర్తి చేసిన తర్వాత స్కూల్ స్నేహితులైన రోహిత్ నేగి, మోహిత్ రాణాతో కలిసి 2021లో హార్ట్ ఇన్ హిల్స్ స్థాపించాడు సత్యం. రోహిత్ సేల్స్, ఆపరేషన్స్‌ను నిర్వహిస్తాడు. మోహిత్ సోర్సింగ్, క్వాలిటీ కంట్రోల్‌పై దృష్టి పెట్టాడు. ఉత్తరాఖండ్‌లో రూ. 3 లక్షల గ్రాంట్‌తో మొదలైన ఈ వెంచర్ రైతుల నుంచి నేరుగా చిరుధాన్యాలను కొనుగోలు చేసి మార్కెట్ ధర కంటే 10-15% ఎక్కువ ధరను అందించింది. చిరుధాన్యాలను గ్రేడింగ్, సార్టింగ్, క్లీనింగ్ చేసి దక్షిణ భారతదేశంలోని కొనుగోలుదారులకు విక్రయించారు. న్యాయమైన ధరలను అందించడమే కాక మార్కెట్‌లోని మధ్యవర్తుల ప్రభావాన్ని తగ్గించింది.
50శాతం లాభాలతో..
కోవిడ్-19 వేవ్ సమయంలో కోల్డ్-ప్రెస్డ్ ఆయిల్స్‌కు పెరిగిన డిమాండ్‌ను గమనించి 2022 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో ఫోరెకాను ప్రారంభించారు. ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన వేద్ ఆర్య స్థాపించిన ది బుద్ధా ఇన్‌స్టిట్యూట్ నుంచి రూ. 22 లక్షల గ్రాంట్‌తో కరౌలి జిల్లాలోని హిందౌన్‌లో ఒక ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థాపించారు. ఈ యూనిట్‌లో కోల్డ్-ప్రెస్డ్ మెషీన్‌లను ఉపయోగిస్తూ ఫోరెకా 50% లాభాలను రైతులతో పంచుకుంటుంది. హౌస్ ఆఫ్ మస్టర్డ్ అనే ప్రాజెక్ట్‌తో మస్టర్డ్ సాస్, చట్నీ వంటి విలువ-ఆధారిత ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోంది.
10000 మంది భాగస్వామ్యం..
ఫోరెకా ఆదాయం 2023-24లో రూ. 60 లక్షల నుంచి 2024-25 మొదటి రెండు త్రైమాసికాల్లో రూ. 1.3 కోట్లకు పెరిగింది. 2024-25 చివరి నాటికి రూ. 2.5 కోట్లకు చేరుకుంటుందని అంచనా. బ్లాక్ మస్టర్డ్ ఆయిల్ లీటర్‌కు రూ. 320, యెల్లో మస్టర్డ్ రూ. 450, గ్రౌండ్‌నట్ ఆయిల్ రూ. 500 ధరలతో, కోల్డ్-ప్రెస్ పద్ధతితో పోషక విలువలను కాపాడుతూ ఉత్పత్తి చేస్తున్నారు. ఫోరెకా రాబోయే మూడేళ్లలో ఐదు రకాల ఆయిల్‌సీడ్‌ల కోసం ప్రాసెసింగ్ యూనిట్‌లను స్థాపించాలని..10,000 మంది రైతులను భాగస్వామ్యం చేసి 250 ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.






