లక్కీ రాశులు.. ఉగాది రోజు ఈ ఐదు రాశుల వారికి రాజయోగం

by samatah |   (  Updated:2023-03-19 06:40:22  IST  )

గ్రహాల కలయిక, ఆగమనం వలన కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్ట యోగం కలుగుతే, మరికొన్ని రాశులకు అశుభం కలుగుతుంది.

లక్కీ రాశులు.. ఉగాది రోజు ఈ ఐదు రాశుల వారికి రాజయోగం
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రహాల కలయిక, ఆగమనం వలన కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అదృష్ట యోగం కలిగితే, మరికొన్ని రాశులకు అశుభం కలుగుతుంది. అయితే ఈ ఉగాది పండుగ వేళ కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఐదు రాశుల వారికి మంచి జరగనుంది. అవి ఏ రాశులో ఇప్పుడు చూద్దాం.

మిథున రాశి : రాశుల కలయిక వలన ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడనుంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. అంతే కాకుండా ఉద్యోగస్థులు ప్రమోషన్ పొందడం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఉగాది రోజు రాజయోగం కలిసి రానుంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.

వృశ్చిక రాశి : గ్రహాల కలయిక వలన మంచి ఫలితాలు వచ్చినప్పటికీ వీరి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వీరు కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మీన రాశి : ఈ రాశి వారికి గ్రహాల సంయోగం కలిసి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ధనలాభం కలిగే అవకాశం ఉంది.

Also read: 1K, 10K, 1M అంటే తెలుసు కదా... మరి 1B, 1T అంటే ఎంతో తెలుసా?

Next Story