- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉస్మాన్ సాగర్‌లో 10 ఎకరాల్లో రాజపుష్ప
టీజీఐఐసీ వేలం వేసిన భూముల్లో రాజపుష్ప 10.09 ఎకరాలను దక్కించుకున్నది. ఉస్మాన్ సాగర్ లో ప్లాట్ 1, 6 లతో పాటు పలు ప్లాట్లను ఆక్షన్ కి పెట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఐఐసీ వేలం వేసిన భూముల్లో రాజపుష్ప 10.09 ఎకరాలను దక్కించుకున్నది. ఉస్మాన్ సాగర్ లో ప్లాట్ 1, 6 లతో పాటు పలు ప్లాట్లను ఆక్షన్ కి పెట్టారు. అందుకే ప్లాట్ నంబర్ 1 ని దక్కించుకున్నది. ఆ స్థలం అదే కంపెనీకి చెందిన ప్రాజెక్టు రాజపుష్ప లైఫ్ స్టయిల్ సిటీకి పక్కనే ఉండడం గమనార్హం. ఎకరానికి రూ.51.25 కోట్లు పెట్టింది. అంటే మొత్తం విస్తీర్ణానికి రూ.517 కోట్ల అన్న మాట. 400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పక్కనే కొత్త స్థలాన్ని సొంతం చేసుకోవడం ద్వారా రాజపుష్ప మరింత బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసింది. ఈ పది ఎకరాల్లో ప్రీమియం రిటైల్ మాల్, గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీతో కూడిన మిక్స్‌డ్-యూజ్ డెవలప్‌మెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇది రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీ మొత్తం ఎకో సిస్టమ్‌ను మరింత మెరుగుపరుస్తుంది. హైదరాబాద్‌లో భారీ స్థాయి ఇంటిగ్రేటెడ్ లైఫ్‌స్టైల్ గమ్యస్థానాలను నిర్మించాలనే రాజపుష్ప నిబద్ధతకు ఈ ఆక్షన్ మరో మైలురాయిగా నిలుస్తుంది.






