వర్షాకాలం వచ్చింది.. విద్యుత్ తో జర పైలం..

by Disha Web Desk 11 |
వర్షాకాలం వచ్చింది.. విద్యుత్ తో జర పైలం..
X

దిశ, వెబ్ డెస్క్: ఎప్పుడెప్పుడూ రుతుపవనాలు వస్తాయా అని ఎదురు చూస్తున్న కాలం రానే వచ్చింది. వర్షాకాలం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విద్యుత్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవడం కోసం కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు బట్టలు ఆరేసుకునే తీగకు విద్యుత్ తీగ తగలకుండా ఉండేలా చూసుకోవాలి. తడి చేతులతో కరెంట్ స్విచ్ లు ఆన్, ఆఫ్ చేయకూడదు. ఇంట్లో ఎక్కడైనా విద్యుత్ తీగలకు జాయింట్స్ ఉంటే వాటిని ఒకసారి ఎలక్ట్రీషియన్ తో మార్పించుకోవాలి. రహదారి వెంట ఉన్న విద్యుత్ పోల్స్ ను పొరపాటున కూడా తాకకూడదు. విద్యుత్ తీగ సర్వీస్ వైర్ కు సపోర్ట్ గా ఉండే జి వైర్ ప్లాస్టిక్ తొడుగు ఉండేలా చూసుకోవాలి.

విద్యుత్ తీగలు ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అవుతున్నట్టు గమనిస్తే వెంటనే మెయిన్స్ ఆఫ్ చేసి విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. తెగి పడిపోయినా, ఎత్తు తక్కువగా ఉన్న కరెంట్ తీగలను తాకకూడదు. రోడ్డుపైన విద్యుత్ తీగలు తెగి పడి పోయినట్లుగా గమనిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకూడదు. అపార్ట్మెంట్ సెల్లార్ లోకి నీళ్లు చేరి విద్యుత్ తీగలు తగిలినా, మీటర్ల దాకా వచ్చినా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. వ్యవసాయ పనులు చేసే రైతులు కూడా వర్షం పడుతున్న సమయంలో వ్యవసాయ మోటార్లను ఆన్ చేయకూడదు.

వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ ఫార్మర్ల పక్కన నిలబడకూడదు. పశువులను సైతం విద్యుత్ తీగలకు, ట్రాన్స్ఫార్మర్ లకు దూరంగా ఉంచాలి. ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినట్లయితే వారిని కాపాడటానికి పొరపాటున కూడా ఐరన్ రాడ్స్ వాడకూడదు. చెక్క లేదా ప్లాస్టిక్ తో చేసినటువంటి వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ఇక వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ మన పాలిట ప్రాణాంతకంగా మారకుండా చూసుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది.

Read More: రైళ్లలో అమర్చిన ఫ్యాన్లకు ఓ స్పెషలిటీ ఉంది.. అందుకే రైళ్లలో ఎవరూ అది చేయలేరు


Next Story

Most Viewed