- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ప్రాజెక్టుకు క్యూఆర్ కోడ్.. మహారాష్ట్ర తరహాలో టీజీరెరా అమలు
త్వరలోనే పబ్లిక్ గ్రీవెన్స్, గైడెన్స్ సెల్

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రలోని మహారెరా ఆధ్వర్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 2023లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసింది. దీంతో ప్రాజెక్టు డెవలపర్లు ప్రమోషన్, అడ్వర్టైజ్మెంట్ సమయంలో క్యూఆర్ కోడ్ ను తప్పనిసరిగా పబ్లిష్ చేయాలని నిర్ణయించింది. అక్కడ విజయవంతంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అదేతరహాలో తెలంగాణలోనూ టీజీ రెరా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
ప్రతి ప్రాజెక్టకు…
బిల్డర్లు, డెవలపర్లు, ప్రమోటర్లు, కొనుగోలుదారులకు మెరుగైన సేవలందించేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (టీజీరెరా) నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టనున్నది. ప్రతి ప్రాజెక్ట్‌కు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇది బయట ప్రతి ఒక్కరిక కనపడేలా ప్రదర్శించాలని, అందుకు బిల్డర్లు, డెవలపర్లు చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు. వినియోగదారులు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్రాజెక్ట్ డెవలపర్, ప్రమోటర్, అపార్ట్‌మెంట్ల సంఖ్య, అనుమతులు వంటి పూర్తి సమాచారాన్ని తక్షణమే తెలుసుకోవడానికి అవకాశముంది. దీంతోపాటు మొబైల్ యాప్ ను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ యాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రెరా కియోస్క్ లు…
గృహ కొనుగోలుదారులతో పాటుగా పెట్టుబడిదారులు సులభంగా, వేగంగా, పారదర్శకంగా సేవలు పొందే విధంగా సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని రెరా నిర్ణయించింది. అందులో భాగంగానే రెరా కార్యాలయంలో కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వినియోగదారులు ప్రాథమిక సేవలను నేరుగా కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా పొందగలిగే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కియోస్క్‌లు చిన్న బ్యాంక్ అవుట్‌లెట్‌ల మాదిరిగా పని చేస్తాయి. వినియోగదారులు ప్రాజెక్ట్ సమాచారం, ఫిర్యాదులు, నమోదు వివరాలు, ఏజెంట్/మధ్యవర్తుల సమాచారం వంటి సేవలను కియోస్క్ ద్వారా పొందడానికి అవకాశముందని టీజీరెరా అధికారులు చెబుతున్నారు. ఈ కియోస్క్‌లు ఏర్పాటు ద్వారా దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పబ్లిక్ గ్రీవెన్స్, గైడెన్స్ సెల్
బిల్డర్లు, డెవలపర్లు, ప్రమోటర్లు, కొనుగోలుదారులకు మెరుగైన సేవలందించేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ (టీజీరెరా)లో పబ్లిక్ గ్రీవెన్స్, గైడెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ధృవపత్రాలు, ఉండాల్సిన అర్హతలు, ఇతర వివరాలను సెల్ వివరించనుంది. దీంతోపాటు ప్రమోటర్లకు ఉండాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించనుంది. ముఖ్యంగా కొనుగోలుదారులకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు, అనుమానాలను సైతం నివృత్తి చేయనుంది. అయితే సెల్ ఏర్పాటుకు సంబంధించి రెరా ఎక్స్ ఫ్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈఓఐ) ద్వారా నోటిఫికేషన్ జారీచేసింది. మూడు ఏజెన్సీలు ముందుకొచ్చాయి. వీరిలో ఒక ఏజెన్సీని ఫైనల్ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు






