- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: ఎంతకు తెగించార్రా.. అక్కడ ఉన్నది అల్లు అర్జున్ కాదా..వైరల్ గా మారిన పుష్ప-2ఫైట్ రియల్ వీడియో
Viral Video: సినిమాలో హీరోలు చేసే ఫైట్స్ చాలామంది రియల్ అనుకుంటారు అలాగే హీరోలు కూడా చెబుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: సినిమాలో హీరోలు చేసే ఫైట్స్ చాలామంది రియల్ అనుకుంటారు అలాగే హీరోలు కూడా చెబుతుంటారు. మేము ఎలాంటి గ్రాఫిక్స్ వాడలేదని రియల్ స్టంట్స్ చేశామని ఊదరగొడుతూ ఉంటారు. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అయితే ఫలానా హీరో ఫలానా ఫైట్ చేస్తుంటే ఫలానా గాయం తగిలిందని అది చూసి తన కళ్ళల్లోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయని డైరెక్టర్ చెబుతుంటాడు. ఇవన్నీ నిజమే అనుకోని పొరపాటు పడే అభిమానులు కూడా ఉంటారు.
కానీ సినిమాల్లో గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒకప్పుడు గ్రాఫిక్స్ లేని రోజుల్లో నిజంగానే హీరోలు కష్టపడి స్టంట్స్ చేసేవారు. ఎందుకంటే అప్పట్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో హీరోలు నిజంగానే పల్టీలు కొడుతూ గోడలు దూకుతూ గాల్లోకి ఎగురుతూ ఫైట్లు చేసేవారు. లాంగ్ షాట్స్ లో మాత్రం డూప్స్ ను వాడేవారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ వచ్చిన అనంతరం కూడా హీరోలు రోప్స్ కట్టుకొని రియల్ స్టెంట్స్ చేసేవారు, 2000 దశకం లో కూడా హీరోలు కాస్త ఒళ్ళు కదిలించి ఫైట్లు చేసేవారు. అవసరమైతే తప్ప డూప్స్ వాడేవారు కాదు.
ఎందుకంటే అప్పటికి ఇంకా పూర్తిస్థాయిలో టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు. కానీ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు హీరో సెట్టుకు కూడా వెళ్లాల్సిన పనిలేదు. డూపులే ఫైట్లు చేసేస్తుంటారు కానీ గ్రాఫిక్స్ లో మాత్రం ఫేస్ మార్చేస్తున్నారు. ఇది నమ్మశక్యం కాకపోవచ్చు కానీ తాజాగా ఇటీవల విడుదలై ఆలిండియా రికార్డులను బద్దలు కొడుతూ సూపర్ హిట్టుగా నిలిచిన ఫ్యాన్ ఇండియా సినిమా పుష్ప టు సినిమాలో అల్లు అర్జున్ సైతం ఈ డూపులనే ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. . అచ్చం అల్లు అర్జున్ లా కనబడే ఓ వ్యక్తి ఫైట్స్ చేస్తున్నాడు. నిజానికి ఇందులో తప్పేమీ లేదు టెక్నాలజీ పెరిగే కొద్దీ హీరోలు రిస్క్ తీసుకోవడం అనేది తగ్గిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాఫిక్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ముఖాలను మార్చడం అనేది చిటికెలో పనిగా మారిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో అల్లు అర్జున్ ఫైట్లు చేస్తున్నాడు దీన్నిబట్టి పిల్లలు మీ హీరోలు నిజంగా ప్రమాదకరమైన స్టంట్స్ చేయరు అని గుర్తుపెట్టుకోండి వాళ్ళని చూసి మీరు స్ఫూర్తి పొంది ప్రమాదకరమైన ఫైట్లు చేశారో ఆస్పత్రిపాలు కాక తప్పదు.






