పబ్లిక్ టాయిలెట్ ఫ్లష్ చేస్తున్నారా? (తప్పక చదవండి)

by Sujitha Rachapalli |

పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారా? అక్కడ రెస్ట్ రూమ్ టాయిలెట్‌ ఫ్లష్ చేసినప్పుడు ఏం జరుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఊహించిన దానికంటే తీవ్రమైన ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తుంది తాజా అధ్యయనం.

పబ్లిక్ టాయిలెట్ ఫ్లష్ చేస్తున్నారా? (తప్పక చదవండి)
X

దిశ, ఫీచర్స్ : పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారా? అక్కడ రెస్ట్ రూమ్ టాయిలెట్‌ ఫ్లష్ చేసినప్పుడు ఏం జరుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఊహించిన దానికంటే తీవ్రమైన ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తుంది తాజా అధ్యయనం. ప్రతి ఫ్లష్ ఆరోగ్య ప్రమాదాలను కలిగించే సూక్ష్మక్రిములతో నిండిన బిందువులను రిలీజ్ చేస్తుందని, గాలిలోకి కనిపించని బ్యాక్టీరియాను పంపుతుందని తెలిపింది. కొన్ని టాయిలెట్ డిజైన్స్ ఈ పరిస్థితిని మరింత దిగజార్చుతాయని వివరించింది.

చైనా యూనివర్సిటీ ఆఫ్ జియోసైన్సెస్ సైంటిస్టులు డిఫరెంట్ టాయిలెట్స్, వెంటిలేషన్ సిస్టమ్స్ గాలిలో బ్యాక్టీరియా వ్యాప్తిని ఎలా ప్రభావితం చేస్తాయో పరిశోధించారు. తరచుగా చర్మంపై, వాయుమార్గాలలో కనిపించే స్టెఫిలోకాకస్ ఆరియస్, ప్రేగులలో నివసించే E. కోలి బ్యాక్టీరియాపై ఫోకస్ చేశారు. ఈ రిజల్ట్ పబ్లిక్ రెస్ట్ రూమ్ యూజ్ చేయాలా వద్దా అని ఆలోచించేలా చేస్తుంది. బిడెట్-స్టైల్‌తో పోల్చినప్పుడు స్క్వాట్ టాయిలెట్‌లు ఎక్కువ బ్యాక్టీరియాను వ్యాపింపజేస్తాయని గుర్తించింది. S. ఆరియస్ 2.6 రెట్లు, E. కోలి 1.4 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఆశ్చర్యకరంగా రెండవ ఫ్లష్ మరింత ఎక్కువ బ్యాక్టీరియాను విడుదల చేస్తుంది. మల్టీ ఫ్లష్‌లు హానికరమైన సూక్ష్మక్రిములకు గురికావడం తగ్గడానికి బదులుగా పెరగవచ్చని సూచిస్తుంది.

ఈ గాలిలో ఉండే నీటి బిందువుల పరిమాణం ఆరోగ్య ప్రమాదాలలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాక్టీరియాతో నిండిన బిందువులు 4.7 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్నాయని, గాలిలో నిలిచి ఉండి ఊపిరితిత్తులలోకి లోతుగా పీల్చబడేంత చిన్నవిగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ సంబంధిత వర్గంలోకి దాదాపు 55-70% S. ఆరియస్, 52-62% E. కోలి బిందువులు వచ్చాయి. అయితే ఇక్కడ వెంటిలేషన్ గేమ్-ఛేంజర్‌గా ఉంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్లను నడపడం వల్ల గాలిలో వచ్చే బ్యాక్టీరియా 2.2 రెట్లు తగ్గింది. ఇది పబ్లిక్ రెస్ట్‌రూమ్‌లలో గాలి ప్రవాహ ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. అయితే చాలా సందర్భాలలో బ్యాక్టీరియా సాంద్రతలు WHO భద్రతా మార్గదర్శకాలను మించిపోయాయి. ముఖ్యంగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారికి ఇన్ఫెక్షన్ ప్రమాదాలను కలిగిస్తాయి. అయితే సరైన వెంటిలేషన్‌తో ఈ ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి.

జాగ్రత్తలు :

* బిడెట్-స్టైల్ ఎంపికల కోసం స్క్వాట్ టాయిలెట్‌లను మార్చుకోవడం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి తగ్గుతుంది.

* వెంటిలేషన్ వ్యవస్థలను టాప్ షేప్‌లో ఉంచడం వల్ల గాలిలో వచ్చే బ్యాక్టీరియా తగ్గుతుంది.

* మల్టిపుల్ ఫ్లష్‌ల అలవాటును పునరాలోచించడం వల్ల అనవసరమైన బయోఎరోసోల్ విడుదలను నిరోధించవచ్చు.

* ఇతరులు టాయిలెట్ యూజ్ చేసి ఫ్లష్‌ చేసినప్పుడు ఎంటర్ అయ్యే ముందు కాసేపు టైమ్ తీసుకోండి.

Next Story