Health Tips : అజీర్తితో కడుపులో గడబిడా?.. ఈ చిట్కాలతో క్షణాల్లో రిలీఫ్!

by Javid Pasha |

Health Tips : అజీర్తితో కడుపులో గడబిడా?.. ఈ చిట్కాలతో క్షణాల్లో రిలీఫ్!

Health Tips : అజీర్తితో కడుపులో గడబిడా?.. ఈ చిట్కాలతో క్షణాల్లో రిలీఫ్!
X

దిశ, ఫీచర్స్ : సుగంధ ద్రవ్యాలకు భారత దేశం పెట్టింది పేరు. ఇవి వంటకాల్లో రుచిని పెంచడమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే జీలకర్ర, దాల్చిన చెక్క, సోంపు వంటి మసాలా దినుసులకు ఇక్కడ ఫుల్ డిమాండ్ ఉంటుంది. హెల్త్ పరంగా చూసుకుంటే బాడీని డిటాక్స్ చేయడంలో, జీర్ణక్రియను మెరుగు పరచడంలో, అధిక బరువును తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు. కాబట్టి ఆహారాల్లో భాగంగా వాటిని వినియోగించడం మంచిదని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ విధమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

*జీలకర్ర : చూడటానికి చిన్నగా ఉండే ఈ గింజలు ప్రతీ భారతీయ వంటకంలో యూజ్ చేస్తారు. రుచిని పెంచడమే కాకుండా అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. శరీరం నుంచి విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. కడుపులో ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. డైజెస్టివ్ ఎంజైమ్‌ల విడుదలను ప్రేరేపించడంవల్ల పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీలకర్రలో విటమిన్ సి, ఇ, ఉండటంవల్ల ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు అర టీ స్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో వేసి, వేడి చేసి ఆ కషాయాన్ని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

*దాల్చిన చెక్క : ఏ ఫంక్షన్ జరిగినా ఇదిలేకుండా వంటనే చేయరు. సువాసనతోపాటు రుచిని అందించే మాసాలా ఇది. డిటాక్స్ లక్షణాలను కలిగి ఉండటంవల్ల ఎంతో మేలు చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అధిక బరువును తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. శరీరంలో నొప్పి, వాపుల నుంచి రిలీఫ్ కలిగిస్తుంది. ఇందులో ఉండే ఫాలీఫెనాల్స్ బాడీ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్‌ను స్పీడప్ చేస్తాయి. అందుకోసం మార్నింగ్ గోరువెచ్చని నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

*సోంపు : సోంపు గురించి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పవర్ ఫుల్ మసాలాగా ప్రసిద్ధి చెందింది. గ్యాస్, అజీర్తి, కడుపులో గడబిడ వంటి సమస్యలు తలెత్తినప్పుడు కొంచెం సోంపు తిన్నా, సోంపు వాటర్ తాగినా రిలాక్స్ అవుతుంది. అంతేకాకుండా సోంపు శరీరంలోని వ్యవర్థాలు, విషపదార్థాలు మూత్రం ద్వారా బయటకు పంపడంలో కీలకంగా పనిచేస్తుంది. కాలేయాన్ని కూడా డిటాక్సిఫై చేస్తుంది. ఒక టీ స్పూన్ సోంపును, ఒక గ్లాసు వాటర్‌లో రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story