లిటిల్ మన్నారతో ప్రియాంక.. వైరల్ అవుతున్న త్రో బ్యాక్ స్టిల్‌

by Disha Web Desk 10 |
లిటిల్ మన్నారతో ప్రియాంక.. వైరల్ అవుతున్న త్రో బ్యాక్ స్టిల్‌
X

దిశ, సినిమా: స్టార్ నటీమణులు ప్రియాంకా చోప్రా, మన్నారా చోప్రాలకు సంబంధించిన ఓ త్రో బ్యాక్ స్టిల్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు మన్నారా చోప్రా హిందీ బిగ్ బాస్ 17 సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా మన్నారా చోప్రాతో దిగిన చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రియాంక.. ‘@memannara good luck little one’ అంటూ హ్యాపీ మూడ్‌లో ఉన్న ఫొటోకు క్యాప్షన్ రాస్తూ శుభాకాంక్షలు చెప్పింది. ప్రస్తుతం ఈ క్యూట్ పిక్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ మన్నారా చోప్రాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇక ‘ప్రేమా గీమా జాన్తా నై’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మన్నారా చోప్రా.. ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ భాషల్లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది.



Next Story

Most Viewed