PM Modi Youtube Channel: వామ్మో.. అసలు సిసలైన యూట్యూబర్‌ మన ప్రధాని.. ఆయన చానల్ ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-01-11 06:53:47  IST  )

PM Modi Youtube Channel: ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Narendra Modi) యూట్యూబ్ ఛానెల్(YouTube channel) ప్రతినెలా ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును నిజమే మన ప్రధాని మోదీ అసలు సిసలైన యూట్యూబర్ అని చెప్పుకోవచ్చు. మోదీ యూట్యూబ్ ఛానెల్ ప్రతినెలా(monthly earnings) సగటు రెవెన్యూ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

PM Modi Youtube Channel: వామ్మో.. అసలు సిసలైన యూట్యూబర్‌ మన ప్రధాని.. ఆయన చానల్ ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) సోషల్ మీడియా(Social media)లో యాక్టివ్ గా ఉంటారు. ఆయనకు ఫేస్ బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో అకౌంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రధానికి నరేంద్రమోదీ అనే అధికారిక యూట్యూబ్ చానల్(YouTube channel) కూడా ఉంది. ఈ చానల్ అక్టోబర్ 26వ తేదీ 2007లో ప్రారంభించారు. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాలు(Project inaugurations), ప్రభుత్వ కార్యక్రమాలు(government programs), ప్రధాని మోదీ ఇంటర్వ్యూ(Prime Minister Modi interview)లతోపాటు ఆయనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఈ చానల్ ప్రసారం చేస్తుంటుంది.

మోదీ యూట్యూబ్ చానల్ కు 26.5 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ లో 20 మిలియన్లకు పైగా సబ్ స్కైబర్స్(Over 20 million subscribers) ఉన్న ఏకైక రాజకీయ నేతగా మోదీనే ముందు వరుసలో ఉన్నారు. అంతేకాదు వ్యూస్, లైక్స్ ద్వారా ఈ చానల్ ప్రతినెలా భారీ ఆదాయాన్ని సంపాదిస్తోంది.

ఓ రిపోర్టు ప్రకారం ప్రధాని మోదీ యూట్యూబ్ చానల్(Modi YouTube channel) నెలకు రూ. 1,62,49,520.70 నుంచి 87,47,697.38 వరకు సంపాదిస్తుంది. ఈ చానల్ ఇప్పటి వరకు 29,272 వీడియోలను అప్ లోడ్ చేసింది. 6,360,331,183 వ్యూస్ సాధించింది. ఈ చానల్ లో అప్ లోడ్ చేసిన చాలా వీడియోలు 40వేల వ్యూస్ దాటుతున్నాయి. సబ్ స్రైబర్ల సంఖ్య కూడా భారీగానే ఉంది. అత్యధిక వ్యూస్ కారణంగా మోదీ యూట్యూబ్ చానల్ భారీ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతి వారం సగటున 19 వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. కాగా మోదీకి ఫేస్ బుక్(Facebook) లో 48 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండగా..ఇన్ స్టాగ్రామ్ లో 82.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక మోదీ తర్వాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనార్ (Jair Bolsonaro)యూట్యూబ్ సబ్ స్కైబర్స్ పరంగా రెండవ అత్యధిక ర్యాంక్ కలిగిన ప్రపంచనాయకుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఈయనకు 6.4మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. మోదీ చానల్ సబ్ స్క్రైబర్స్ (Modi YouTube channel)లో 4వ వంత మాత్రమే.

Next Story