- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గర్భిణులకు గుడ్ న్యూస్.. ఈ డివైజ్‌తో ఫోన్‌లోనే బేబీ విజువల్స్ చూడొచ్చు!
గర్భిణులకు గుడ్ న్యూస్. మొబైల్‌లో బేబీ కదలికలను గమనించే ‘రిమోట్ అల్ట్రాసౌండ్’ను సైంటిస్టులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

దిశ, ఫీచర్స్: గర్భిణులకు అదిరిపోయే గుడ్ న్యూస్. కడుపులో పెరుగుతున్న బిడ్డ స్కానింగ్ కోసం ఇకపై హాస్పిటల్‌కు పరిగెత్తాల్సిన పనిలేదు. ఇంట్లో ప్రశాంతంగా పడుకుని ఫోన్‌లోనే బేబీ విజువల్స్ చూసుకునే ఎలక్ట్రానిక్ డివైజ్‌ను సైంటిస్టులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ‘రిమోట్ అల్ట్రాసౌండ్’తో ప్రెగ్నెంట్ ఉమెన్స్ బిడ్డ కదలికలను గుర్తించవొచ్చని, దీనిద్వారా బిడ్డ సంరక్షణను సంబంధించిన ఒత్తిడిలేకుండా ఉండొచ్చని చెబుతున్నారు. ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఈ పోర్టబుల్ అల్ట్రాసౌండ్ పరికరం గర్భిణీ స్త్రీలకు మనశ్శాంతిని ఇవ్వడంతోపాటు తల్లీ-బిడ్డ క్షేమంలోనూ ఎంతో మేలు చేస్తుందంటున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి ఒక వరంగా మారుతోందని భావిస్తు్న్నారు.
ఎలా పనిచేస్తుంది?
టీవీ రిమోట్ సైజులో ఉండే ఈ రిమోట్ అల్ట్రాసౌండ్ టెలిమెడిసిన్ AI సాయంతో పనిచేస్తుంది. దీనిని స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ దీనికి జెల్ అప్లై చేసి చేతిలో పట్టుకుని పొట్టపై స్కాన్ చేయాలి. డివైజ్ కడుపుపై ఎక్కడ ఉంచాలి? ఎలా తిప్పాలి? అనే గైడెన్స్ మొబైల్ యాప్‌లో ఉంటాయి. వైద్యుల సహాయం లేకుండానే బిడ్డ ఫొటోలను తీసుకోవచ్చు. అంతేకాదు ఫోన్‌లో తీసిన ఇమేజ్ లేదా వీడియోను డాక్టరుకు పింపిస్తే.. బేబీ కదలికలు, హార్ట్ బీట్‌కు సంబంధించిన రిపోర్ట్స్ పంపిస్తారు. వీడియో కాల్‌లోనూ డాక్టర్‌కు చూపిస్తే సూచనలు ఇస్తారు. బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరు స్థాయిని కూడా డాక్టర్లు దీని ద్వారా అంచనా వేయగలరు. ఇందులో బిడ్డ గుండె చప్పుడు వినడంతోపాటు స్పష్టంగా చూడొచ్చు. బిడ్డ చేతులు, కాళ్లు కదపడం లేదా అటు ఇటు తిరగడం వంటివి లైవ్ వీడియోలో కనిపిస్తాయి.
కోవిడ్-19లోనూ..
ఫ్రాన్స్‌కు చెందిన AdEchoTech సంస్థ మొదట Melody అనే రోబోటిక్ అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. దీని ఆధారంగానే ‘రిమోట్ అల్ట్రాసౌండ్’ను రూపొందించారు. కోవిడ్-19 సమయంలో డాక్టర్లు రోగికి దూరంగా ఉండి పరీక్షలు చేయడానికి ఈ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించారు. చైనాలోని వుహాన్‌లో 5G నెట్‌వర్క్ ద్వారా రిమోట్ అల్ట్రాసౌండ్‌ను విజయవంతంగా ప్రయోగించారు. అత్యవసర పరిస్థితుల్లో.. గుండెపోటు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు రోగిని హాస్పిటల్‌కు తరలించే లోపే అంబులెన్స్‌లోనే స్కాన్ చేసి చికిత్స చేయొచ్చు.






