Pregnancy care: భర్త ఇలా చేస్తే భార్య నార్మల్ డెలివరీ అవ్వడం ఖాయం

by Vennela |

Pregnancy care: ప్రసవం అనేది పునర్జన్మ వంటిది. అందుకే గర్బం (Pregnancy)దాల్చినప్పటి నుంచి బిడ్డపుట్టే (Pregnancy care)వరకు మహిళలకు అన్ని విధాల సహకారం అవసరం.

Pregnancy care: భర్త ఇలా చేస్తే భార్య నార్మల్ డెలివరీ అవ్వడం ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్: Pregnancy care: ప్రసవం అనేది పునర్జన్మ వంటిది. అందుకే గర్బం (Pregnancy)దాల్చినప్పటి నుంచి బిడ్డపుట్టే (Pregnancy care)వరకు మహిళలకు అన్ని విధాల సహకారం అవసరం. ఉమ్మడి కుటుంబాలు ఉన్నరోజుల్లో అందరూ పక్కన ఉంటూ కంటికి రెప్పలా చూసుకునేవారు. కెరీర్, ఉద్యోగాల పేరుతో ఊరికి అమ్మానాన్నలకు దూరంగా ఉంటున్నారు చాలా మంది.

తొలికాన్పు ఎక్కువగా పుట్టింట్లో(Pregnancy care)నే చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో సిటీల్లో వైద్య సదుపాయాలు ఉండటంతో మొదటి కాన్పులూ ఇక్కడే అవుతున్నాయి. ఈ క్రమంలో కన్నవారి స్థానంలో కట్టుకున్నవారే సపర్యలు చేస్తున్నారు. భార్య గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు భర్తలే వారి బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేసే మహిళలకు మెటర్నిటీ లీవ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కొన్ని సంస్థలు పురుషులకు కూడా మెటర్నిటీ లీవ్స్ అందిస్తున్నారు. వైద్యపరమైన జాగ్రత్తలు పాటించడం వల్ల చాలా వరకు సాధారణ కాన్పులు అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

మహిళా గర్భం(Pregnancy care) దాల్చిన తర్వాత వచ్చే మార్పులను కౌన్సెలింగ్ ద్వారా తమ దగ్గరకు వచ్చే వారికి విడమర్చి చెబుతామని వైద్యులు చెబుతున్నారు. మొదటినెల నుంచి ప్రసవం వరకు వచ్చే మార్పులను ఆయా మహిళల భర్తలకు వివరిస్తామని అన్నారు. ఈ రోజుల్లో కాన్పు అంటే ఒక్క మహిళదే బాధ్యత కాదని, భార్యతో సమానంగా భర్త సహాయం అందించాలంటున్నారు. పెద్దవారు లేని ఇళ్లలో భర్త మరింత కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. అది పుట్టబోయే బిడ్డ(Pregnancy care)కు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం అవసరం ఉన్నా, లేకపోయినా సిజేరియన్లు(Pregnancy care) చేసేస్తున్నారు. ఇందులో అటు ఆసుపత్రులే కాకుండా గర్బిణీ(Pregnancy care) కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంటుంది. నొప్పులు భరించలేరన్న భయంతో కొందరు, ఫలానా ముహూర్తానికే బిడ్డ పుట్టాలంటూ ఇంకొందరు సిజేరియన్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ సరైనవి కాదంటున్నారు వైద్యులు. మహిళ ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ద్రుష్ట్యా సాధారణ ప్రసవమే మంచిదని వారు సూచిస్తున్నారు. భర్తల సహకారం అందిస్తే ఇది సాధ్యమవుతోందని ఇలా భార్యకు భర్త అన్నింటి చేదోడు, వాదోడుగా ఉండటం పుట్టే బిడ్డకే కాదు దంపతుల మధ్య అన్యోన్యతలకు ఒక టానిక్ లా పనిచేస్తుందని మానసిక నిపుణులు కూడా చెబుతున్నారు.

Next Story