- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టూవర్టుపురం గ్రామానికి సెల్యూట్ చేయించిన మహిళ.. ఏకంగా ఊరు పేరునే మార్చేసిందిగా..

దిశ, రాజమహేంద్రవరం : పుట్టింది ఎక్కడ అన్నది ముఖ్యం కాదు.. ఎలా బతికామనేదే ముఖ్యమనే నానుడికి ప్రత్యక్ష నిదర్శనం సాతుపాటి ప్రసన్నశ్రీ. పుట్టిన ప్రాంతం గుంటూరు జిల్లా స్టూవర్టుపురం. మచ్చపడ్డ ఊరిపేరును, ప్రజలను మార్చాలనే లక్ష్యంతో పని చేసిన తాత, తండ్రి ఆశయాలను పుణికి పుచ్చుకున్న సరస్వతీ పుత్రిక. బతుకులు బాగు పడాలంటే విద్య ఒక్కటే మార్గమనే నమ్మిన ప్రసన్నశ్రీ ప్రస్తుతం ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి.
తొలి గిరిజన మహిళ..
స్టూవర్టుపురం పేరంటే వ్యవస్థలకు ముచ్చెమటలు. అలాంటి ఊరి నుంచి వచ్చిన గిరిజన మహిళ సాతుపాటి ప్రసన్నశ్రీ. ఆమె తండ్రి ప్రసాదరావు రైల్వేలో వైద్యాధికారి. తల్లి వసుంధరాదేవి. ప్రసన్న శ్రీకి చిన్నప్పటినుంచీ చదువుకోవడం అన్నా, పదిమందికి చదువును పంచడం అన్నా ఎంతో మక్కువ. అందువల్లే డిప్యూటీ కలెక్టరుగా అవకాశం వచ్చినా అధ్యాపక వృత్తిలోనే స్థిరపడ్డారు. సర్దార్ పటేల్ మహావిద్యాలయలో పీహెచ్‌డీ చేసిన ఆమె తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాల యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం మొదలుపెట్టారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. గిరిజనుల జీవన స్థితిగతులు, భాషలపై పరిశోధనలు చేసి 2021లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు.19 గిరిజన భాషలకు అక్షరాలు రాసి అమెరికాలో ప్రతిష్ఠాత్మక ఎన్‌డేంజరెడ్ పురస్కారాన్ని అందుకున్నారు. 125 పరిశోధన వ్యాసాలు రాశారు. ఇప్పటికి 40కి పైగా పురస్కారాలు అందుకున్నారు. ఆమె ప్రతిభను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్‌లర్‌గా నియమించారు. రాష్ట్రంలో ఉపకులపతిగా నియమితురాలైన తొలి ఎరుకల సామాజికవర్గ (ఎస్ టి) మహిళ సాతుపాటి ప్రసన్నశ్రీ కావడం విశేషం.






