Power of Silence : నిశ్శబ్దం.. మరో మార్గంలో పవర్‌ఫుల్ కమ్యూనికేషన్!

by Javid Pasha |   (  Updated:2024-12-07 16:29:27  IST  )

Power of Silence : నిశ్శబ్దం.. మరో మార్గంలో పవర్‌ఫుల్ కమ్యూనికేషన్!
X

దిశ,ఫీచర్స్ : నిశ్శబ్దాన్ని కొందరు బలహీనతగా భావిస్తుంటారు. మరికొందరు మౌనం అర్ధాంగికారమని అభివర్ణిస్తుంటారు. ఇంకొందరు లోన్లీనెస్‌గానూ, బాధాకరమైన పరిస్థితిగానూ పేర్కొంటారు. భావోద్వేగాల అణచివేతకు ప్రతిరూపమని చెబుతుంటారు. అయితే అన్ని సిచువేషన్లకూ అవి వర్తించవని, వాస్తవానికి నిశ్శబ్దం మరొక రూపంలో పవర్ ఫుల్ కమ్యూనికేషన్ అని మానసిక నిపుణులు అంటున్నారు. పర్సనల్ లైఫ్ మొదలు కొని ప్రపంచ స్థాయి సమస్యల వరకు నిశ్శబ్దమొక చక్కటి పరిష్కారమని, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతికూలతకే పరిమితం కాదు..

నిశ్శబ్దాన్ని మనం తరచుగా కుట్ర, బలహీనత, ఎత్తుగడ, బిజీ లైఫ్, పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం, అహంకారం, బాధ, భావోద్వేగ అణచివేత వంటి ప్రతికూల అర్థాలకే పరిమితం చేసి చూస్తుంటాం. అయితే మాట్లాడాల్సిన చోట మాట్లాడకపోవడం, చొరవ చూపాల్సిన చోట చూపకపోవడం, ప్రశ్నించాల్సినచోట ప్రశ్నించకపోవడం వంటి అరుదైన సందర్భాల్లో మినహా చాలా వరకు నిశ్శబ్దానికి ఈ భూగోళమంత విశాలమైన సానుకూలత ఉందంటారు నిపుణులు. అది గుర్తించగలినప్పుడు మౌనం మరో మార్గంలో పవర్ ఫుల్ కమ్యూనికేషన్ అనేది అర్థమవుతుంది. మౌన వ్రతాలు, మౌన పోరాటాలు వంటివి సానుకూల అంశాలుగా పరిగణిస్తు్న్నప్పుడు, వ్యక్తిగత, వృత్తి జీవితాలకు వచ్చేసరికి దానిని ప్రతికూలతకు ప్రతిరూపంగా చూడటంలో అర్థం లేదంటున్నారు నిపుణులు.

సానుకూల ధోరణికి ప్రతిరూపం

మౌనం వీడితే మంచిదే.. కానీ కొన్ని సందర్భాల్లో వీడకపోతేనే బెటర్. ఎందుకంటే అన్నిచోట్లా అది పనిచేయదు. మనకు ఉపయోగం లేచిచోట అనవసరంగా మాట్లాడటం, సమయాన్ని వృథా చేయడం కంటే సైలెన్స్‌గా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. ఆచరణ పరంగా చూసినా అతిగా మాట్లాడటం, అతిగా తినడం, అతిచొరవ, అత్యుత్సాహం, అతినిద్ర, అతి ఆలోచన అన్నీ అనారోగ్యకరమైనవే. నిశ్శబ్దం విషయంలో మాత్రం అలాంటి ప్రతికూలతలేమీ లేవు. తక్కువ నిశ్శబ్దంగా ఉన్నా, ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నా, తక్కువసేపు సైలెన్స్‌గా ఉన్నా, ఎక్కువ సేపు సైలెన్స్‌గా ఉన్నా అది పూర్తి వ్యక్తిగతమైన అంశంగా, మీ స్వేచ్ఛకు ప్రతిరూపంగా, అంతర్గత భావనగా ఉంటుంది. పైగా ఇది శారీరక, మానసిక ఆరోగ్య, మానసిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న సానుకూల ధోరణికి ప్రతిబింబం అంటున్నారు నిపుణులు.

ఫిజికల్ హెల్త్‌పై ప్రభావం

నిశ్శబ్దమనేది కొన్నిసార్లు నిబద్ధకు మారు మాత్రమే కాదు, అది శారీరక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. సైలెన్స్‌గా ఉండే సందర్భం మీలో అధిక రక్తపోటును తగ్గిస్తుందని, రోగ నిరోధక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుందని పరిశోధనలు సైతం చెబుతున్నాయి. రక్తంలో కార్టిసాల్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో, హార్మోన్ల నియంత్రణలో కీ రోల్ పోషించడం ద్వారా ధమనుల్లో ఫలకాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అంతేకాదు, నిశ్శబ్దంగా ఉండటంవల్ల ఎండార్ఫిన్, మెలటోనిన్ వంటి హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి క్వాలిటీ స్లీప్‌ను ప్రేరేపించడం ద్వారా మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మెంటల్ హెల్త్‌పై ఎఫెక్ట్

మీరు ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా సరే.. నిశ్శబ్దాన్ని ఆశ్రయించకపోతే మీలో ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. ఎందుకంటే అది ఆందోళన, ఒత్తిడి, మానసిక కల్లోలం వంటి ప్రతికూల భావాలను అడ్డుకునే గొప్ప ఆయుధం. ఆలోచనల్లో, పనిలో క్రియేటివిటీకి, ఏకాగ్రతకు అసలైన ప్రేరణ. సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఎస్టీమ్ వంటివన్నీ నిశ్శబ్ద సమయంలో పుట్టుకొచ్చే శక్తి సామర్థ్యాలే. ప్రతికూల ఆలోచనలను పారదోలి ఆనందాన్ని, మానసిక వికాసాన్ని కలిగించే పవర్ ఫుల్ కమ్యూనికేషన్ కూడా నిశ్శబ్దమే. ఏకాగ్రతను, మెదడు సామర్థ్యాన్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ను పెంచుతుంది. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్, సెల్ఫ్ రిఫ్లెక్షన్స్ వంటివి దానివల్లే ఏర్పడతాయి. నేటి పోటీ ప్రపంచంలో మిమ్మల్ని అన్ని విధాలుగా తీర్చిద్దే పునరుజ్జీవన, పునరుద్ధరణ శక్తి సామర్థ్యాలు కలిగిన పవర్ ఫుల్ టూల్ ఏదైనా ఉందంటే నిశ్శబ్దమే. వాకింగ్, మెడిటేషన్, యోగ, ప్రకృతిలో గడపడం.. ఇలా అనేక మార్గాల్లో మీరు దానిని ఆస్వాదించవచ్చు.

Read More...

Love tips: అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు..!


Next Story