- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోర్టబుల్ డీసాలినేషన్ టెక్నాలజీ.. కలుషిత నీటిని మంచినీరుగా మార్చే పరికాలు!
పోర్టబుల్ డీసాలినేషన్ డివైజ్‌లు ఉప్పునీటిని, కలుషిత నీటిని, శుద్ధమైన తాగునీటిగా మార్చేస్తాయి.

దిశ, ఫీచర్స్ : నీటిని శుద్ధి చేసే సాధారణ యంత్రాల గురించి మీరు వినే ఉంటారు. కానీ సముద్రపు ఉప్పునీటిని, అలాగే కలుషిత నీటిని కూడా స్వచ్ఛమైన తాగునీటిగా మార్చుకోగలిగే పోర్టబుల్ డివైజ్‌ల గురించి మీరు విన్నారా? ప్రస్తుతం శాస్త్రవేత్తలు వీటి అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఈ పోర్టబుల్ డీసాలినేషన్ టెక్నాలజీ ప్రపచం వ్యాప్తంగా తాగునీటి కొరతను పరిష్కరించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందాం.
థర్మాస్ సైజు పరికరాలు కూడా..
ప్రధానంగా గ్రాఫీన్ ఆక్సైడ్ మెంబ్రేన్లు, రివర్స్ ఆస్మోసిస్(RO)& ఐయాన్ కాన్సంట్రేషన్ పోలరైజేషన్ (ICP) ఆధారిత చిన్న పరికరాలను శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. ఇవి సూట్‌కేస్ లేదా థర్మాస్ సైజులో ఉండి, తక్కువ ఎనర్జీతో మాన్యువల్ పంప్ లేదా సోలార్ లేదా బ్యాటరీ ద్వారా కూడా పనిచేస్తూ సముద్రపు ఉప్పునీటిని తాగు నీటిగా మార్చగలవు. ఉదాహరణకు లండన్‌కు చెందిన హైడ్రో విండ్ ఎనర్జీ కంపెనీ QuenchSea 3.0 అనే డివైజ్‌ను డెవలప్ చేసింది. ఇది మాన్యువల్ పంప్‌తో గంటకు 6-8 లీటర్ల ఉప్పు నీటిని, కలుషిత నీటిని తాగేందుకు ఉపయోగపడే మంచినీటిగా మారుస్తుంది.
ఎవరు తయారు చేశారు?
చైనాలోని శాంఘై శాస్త్రవేత్తలు కూడా థర్మాస్ ఆకారపు డివైజ్‌ను గ్రాఫీన్ ఆక్సైడ్ మెంబ్రేన్‌తో తయారు చేశారు. ఇది ఒక కేజీ బరువు ఉప్పు అయాన్లను 99.9% తొలగిస్తుంది. అలాగే మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పోర్టుబుల్ యూనిట్ ఇంజినీర్లు సోలార్-పవర్డ్ సూట్‌కేస్ సైజ్ డివైజ్‌ను అభివృద్ధి చేశారు. దీంతోపాటు పలు ఇతర సంస్థలు కూడా ఈ పరికరాలపై పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ సాంప్రదాయ రివర్స్ ఆస్మోసిస్(RO) వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ ఒత్తిడితో పనిచేస్తాయి. దీంతో చిన్న, పోర్టబుల్ డివైజ్‌లు సమర్థవంతగా తయారు చేయడం సాధ్యమవుతోందని నిపుణులు అంటున్నారు.
ఫిల్ట్రేషన్ టూల్స్ ఉపయోగం
పోర్టబుల్ డీసాలినేషన్ డివైజ్‌లు ఉప్పునీరు, కలుషిత నీటిని ఒక్కసారిగా ఉపయోగించి తక్షణమే తాగునీటిని అందిస్తాయి. కాబట్టి ఈ సాంకేతికత విపత్తు సహాయక చర్యల్లో అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే ఎడారిప్రాంతాల్లో, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో తక్షణం శుద్ధమైన నీటిని అందించడం సాధ్యం అవుతుంది. భారీ శుద్ధినీటి సరఫరా లారీలను రవాణా చేయాల్సిన అవసరం తొలగిపోతుంది. పెద్ద ఎత్తున డీసాలినేషన్ ప్లాంట్లు ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. పైగా ఇవి ఖరీదైనవి కూడా. కానీ పోర్టబుల్ ఫిల్ట్రేషన్ టూల్స్ అందుకు భిన్నం. ఇవి మరింత స్థిరమైన, స్కేలబుల్ పరిష్కారం అందిస్తాయి. ఈ అధునాతన ఫిల్టర్లను దీర్ఘకాలం ఉపయోగించదగినవిగానూ పేర్కొంటున్న శాస్త్రవేత్తలు, సామాన్య ప్రజలకు అనుకూలమైన ధరలో అందుబాటులో ఉండేలా చేయడంపై దృష్టిసారిస్తున్నారు. ఇలాంటి ఆవిష్కరణలు మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ సవాళ్లను ఎలా పరిష్కరించగలదో తెలియజేస్తున్నది.






