- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మినరల్ వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారా?
బయటికి వెళ్లినప్పుడు మనం సాధారణంగా రోడ్డు పక్కన దొరికే నీటిని తాగడానికి భయపడుతుంటాం. అందుకే ఎక్కువమంది మినరల్ వాటర్ బాటిల్స్ వైపు మొగ్గు చూపుతారు. అవి శుభ్రంగా ఉంటాయని, ఆరోగ్యకరమని భావించి తాగుతుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: బయటికి వెళ్లినప్పుడు మనం సాధారణంగా రోడ్డు పక్కన దొరికే నీటిని తాగడానికి భయపడుతుంటాం. అందుకే ఎక్కువమంది మినరల్ వాటర్ బాటిల్స్ వైపు మొగ్గు చూపుతారు. అవి శుభ్రంగా ఉంటాయని, ఆరోగ్యకరమని భావించి తాగుతుంటారు. కానీ.. తాజా అధ్యయనం తేల్చిన విషయాలు చూస్తే ఇకపై అలాంటి నీటిని తాగవారు ఎవరైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించక తప్పదు.
259 మినరల్ వాటర్ బాటిల్స్‌లో పరిశోధన
న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జర్నలిజం ప్రాజెక్ట్ "Orb Media"తో కలిసి ఒక విశ్లేషణ నిర్వహించారు. ఇందులో అమెరికా, చైనా, భారత్, బ్రెజిల్, ఇండోనేషియా, కెన్యా వంటి 9 దేశాల్లో చలామణిలో ఉన్న 11 ప్రముఖ బ్రాండ్ల మినరల్ వాటర్ బాటిల్స్ ను పరీక్షించారు. మొత్తం 259 బాటిల్స్‌లోని వాటర్ శాంపిల్స్ ను సేకరించారు.
90% బాటిల్స్‌లో ప్లాస్టిక్ రేణువులు
ఈ పరీక్షల్లో 90 శాతం మినరల్ వాటర్ బాటిల్స్ నీటిలో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒక్కో బాటిల్‌లో గరిష్టంగా 10 వేల మైక్రోప్లాస్టిక్ రేణువులు కూడా ఉన్నట్లు గుర్తించారు. అన్ని నమూనాల్లో కేవలం 17 బాటిల్స్ నీటిలో మాత్రమే ప్లాస్టిక్ అవశేషాలు లేవు అని తేలింది.
మినరల్ వాటర్ కంటే కుళాయి నీరే మేలు?
మినరల్ వాటర్ బాటిల్స్‌లో ఉండే నీరు, మామూలు కుళాయి నీటితో పోల్చితే ఎక్కువ హానికరం కావచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ తయారీలో ఉపయోగించే పదార్థాల వల్ల ఈ ప్లాస్టిక్ కణాలు నీటిలోకి చేరుతున్నట్టు అంచనా వేశారు.
WHO స్పందన
ఈ విషయంపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) – మినరల్ వాటర్ బాటిల్స్‌లోని నీటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై త్వరలోనే లోతైన అధ్యయనం చేపడతామని తెలిపింది. అయితే ఇప్పటికీ ప్రజలు మాత్రం బయట నీరు తాగే ముందు పునరాలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆరోగ్యంగా ఉండాలంటే మినరల్ వాటర్ బాటిల్స్‌లోని నీరే బెటర్ అని అనుకుంటూ వచ్చాం. కానీ తాజా పరిశోధన వెలుగులోకి వచ్చాక, వీటిపై స్పష్టత వచ్చే వరకూ జాగ్రత్తగా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.






