శ్రావణ మాసంలోనే నాటాల్సిన మొక్కలు ఏవో తెలుసా..?

by Disha Web Desk |
శ్రావణ మాసంలోనే నాటాల్సిన మొక్కలు ఏవో తెలుసా..?
X

దిశ, వెబ్​డెస్క్​: హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి పెద్ద పీట వేస్తారు. ఈ మాసంలో అత్యధికులు దేవతారాధన చేస్తారు. ప్రతి ఇంటిని ఓ ఆలయంగా మార్చుకుని నియమ నిష్ఠలతో పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ శ్రావణ మాసంలో వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని మొక్కలు నాటితే మంచిదని పండితులు పేర్కొంటున్నారు. మరి ఇంటిలో ఎలాంటి మొక్కలు నాటాలి..? ఏ వైపున నాటాలో తెలుసుకుందాం..

శని దేవుని అనుగ్రహం పొందాలంటే ఇంట్లో తప్పనిసరిగా జమ్మి మొక్కను నాటాలట. జమ్మి మొక్కను పూజిస్తే శుభం కలగడంతోపాటు శని దోషాలు వదిలించుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు. జమ్మి మొక్కతోపాటే తులసిని కూడా నాటితే అధిక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఇంట్లో చెడు, ప్రతికూలతను పోగొట్టుకోవాలంటే ప్రధాన ద్వారానికి కుడివైపున అరటి మొక్క నాటాలని వాస్తు శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. శివుడికి ప్రీతిపాత్రమైన ఉమ్మెత్త మొక్కను నాటితే ఆ పరమ శివుడే ఇంట్లో కొలువై ఉన్నట్లు హిందువులు భావిస్తారు. అయితే దీనిని ఎప్పుడుపడితే అప్పుడు నాటవద్దట. ఆదివారం లేదా మంగళవారం ఈ మొక్కను నాటితే ఇంట్లో అంతా మంచే జరుగుతుందని పూర్వీకుల కాలం నుంచి వస్తున్న నమ్మకం. అలాగే చంపా మొక్కను ఇంట్లోని వాయువ్య దిశలో నాటితే డబ్బుకు కొదవ లేకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందడమే కాకుండా శుభ ఫలితాలు పొందుతారని వాస్తుశాస్త్ర పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఈ కథనం వివిధ జ్యోతిష్య నిపుణులు ఇంటర్నెట్‌లో పెట్టిన వివరాల ప్రకారం అందించబడింది. దీనికి 'దిశ'కు ఎలాంటి సంబంధం లేదని గమనిక.

ఇవి కూడా చ‌ద‌వండి :

అదే పనిగా సెక్స్‌లో పాల్గొంటున్నారా?


Next Story

Most Viewed