- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health & Diet : ఆయుష్షును పెంచే ప్లానెటరీ హెల్త్ డైట్.. డెత్‌రిస్క్ 30% తగ్గుతుందంటున్న నిపుణులు
Health & Diet : ఆయుష్షును పెంచే ప్లానెటరీ హెల్త్ డైట్.. డెత్‌రిస్క్ 30% తగ్గుతుందంటున్న నిపుణులు

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండడంలో, ఎక్కువ కాలం జీవించడంలో తీసుకునే ఆహారాలు కూడా కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో కూడా అనేక రకరకాల ఆహార నియమాలకు సంబంధించిన విషయాలు తరచుగా తరచుగా ట్రెండ్ అవుతున్నాయి. ఫైనాల్లీ ఆహారం ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచే ఆహారాల గురించి చర్చించడమే వీటి ఉద్దేశంగా నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి వాటిలో ప్లానెటరీ హెల్త్ డైట్ (PHD) కూడా ఒకటి. సాధారణ డెత్‌రిస్క్‌ను 30% తగ్గించడంలో ఇది సహాయపడుతుందనే ప్రచారంతో చాలామంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు.
ప్లానెటరీ హెల్త్ డైట్(Planetary Health Diet) అనేది మానవ ఆరోగ్యం, పర్యావరణ స్థిరత రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటూ ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడానికి ఉద్దేశించిన ఒక విధానంగా నిపుణులు, దానిని ఫాలో అయే ఇన్‌ఫ్లుయెన్సర్లు పేర్కొంటున్నారు. ఇది మొత్తం ప్లాంట్‌బేస్డ్(Plant-based)గానే ఉంటుంది. కాబట్టి పర్యావరణానికి హాని కలిగించకుండా మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందించే మొక్కల ఆధారిత ఆహారాలపై దృష్టి పెట్టడమే దీని ఉద్దేశంగా నిపుణులు చెబుతున్నారు. హార్వర్డ్ టి.హెచ్.చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(Harvard T.H. Chan School of Public Health) నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు ‘ఈట్ లాన్‌సెట్ (EAT-Lancet)’ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు పబ్లిష్ అయ్యాయి.
మొక్కల ఆధారిత ఆహారాలను ఎక్కువగా తీసుకోవడమే ప్లానెటరీ హెల్త్ డైట్ అసలు లక్ష్యం. ఇందులో ప్రాసెస్ చేసిన ఫుడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అట్లనే మాంసం, పాల ఉత్పత్తులు కూడా మితంగా ఉంటాయి. పండ్లు, కూరగాయలు, నట్స్, చిక్కుళ్లు, బీన్స్, పప్పుధాన్యాలు, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ వంటి పోషకాలు అధికంగా ఉండే, లో-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి న్యూట్రియంట్-రిచ్ ఫుడ్స్ శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందించడంతోపాటు రక్తంలో షుగర్ లెవల్స్‌ను, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. హెల్లీ బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ మెయింటైన్‌లో కీలకపాత్ర పోషిస్తాయి. దీంతో హైబీపీ, స్ట్రోక్, గుండె జబ్బులు వంటిరాకపోవడంవల్ల ఎక్కువరోజులు జీవించే అవకాశాలు మెరుగు పడుతాయి. కాబట్టి సాధారణంకంటే డెత్ రిస్క్ 30% తగ్గుతుంది అంటున్నారు ప్లానెటరీ హెల్త్ డైట్‌ను సమర్థించే నిపుణులు.
*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






