- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైలెంట్ మోడ్‌లో ఫోన్.. ఈ లక్షణాలను చూపిస్తుంది..
అసలు ఫోన్ అనేది ఓ వ్యసనం అయిపోయింది. ఇలాంటి రోజుల్లోనూ కొందరు ఫోన్ దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తుంటరు. సైలెంట్ మోడ్‌లో పెట్టేసి వాళ్ల పని వాళ్లు చేసుకుంటరు. ఇలాంటి వాళ్ల వ్యక్తిత్వం గురించి అధ్యయనాలు చెప్తున్నది ఇదే.

Viral Video: భారత్ - పాక్ ఉద్రిక్తత వేళ మీ మొబైల్ ఫోన్లో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే సురక్షితంగా ఉంటారు..ఎలాగంటే?
దిశ, ఫీచర్స్ : ఎక్కడ చూసినా ఫోన్.. బాత్రూమ్‌కు వెళ్లినా కూడా వదలని జనాలు ఉన్నరు. కానీ చాలా తక్కువ మంది ఫోన్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెడుతుంటారు. రోజుకు నాలుగు ఐదు గంటలకోసారి ఫోన్ చెక్ చేసేలా నిబంధన పెట్టుకుంటారు. ఇలాంటి వారి వ్యక్తిత్వంలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. అవేంటో తెలుసుకుందాం.
వ్యక్తిగత సరిహద్దులు
ఫోన్ ఉంటే రోజుకు బోలెడన్ని నోటిఫికేషన్స్ వస్తుంటాయి. కానీ ప్రతిసారి మనం చేస్తున్న పనిని మానుకుని వాటిని చూసిన ప్రతిసారి.. మళ్లీ ఆ పనిని రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. దీని కారణంగా మెదడు అలసిపోతుంది. అలా కాకుండా ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టారంటే.. ఎప్పుడు, ఎలా స్పందించాలో నిర్ణయించుకున్నట్లు. నోటిఫికేషన్లతో డిస్టర్బ్ కాకుండా.. మీ సమయం, మానసిక స్థలంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నట్లు అంటున్నారు నిపుణులు.
ఫోకస్
నోటిఫికేషన్ల కారణంగా వచ్చే నిరంతర శబ్దాలు ఏకాగ్రతను భంగపరుస్తాయని తెలుసు. అందుకే ఫోన్ సైలెంట్‌లో పెట్టేసి పనిపై ఫోకస్ చేస్తుంటారు. ఈ పద్ధతి ఆలోచనా శక్తిని పెంచడంతోపాటు ఉత్పాదకతను పెంచుతుంది. మీరు ఈ అలవాటు ఫోకస్డ్, డీప్ వాల్యూస్ ఉన్న వ్యక్తిగా చెప్తుంది.
మైండ్‌ఫుల్‌నెస్
ఫోన్‌లో మునిగిపోయి చుట్టుపక్కల పరిసరాలను మరిచిపోయే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టే వ్యక్తులు ఇలా కాకుండా శరీర సంకేతాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. అకస్మాత్తు శబ్దాల నుంచి దూరంగా ఉండటం వల్ల జీవితం మరింత శాంతంగా, ఉద్దేశపూర్వకంగా ఉంటుంది. ఈ క్షణంలో జీవిస్తారు.
తక్కువ ఒత్తిడి స్పందన
నోటిఫికేషన్లు అనవసరంగా ఒత్తిడిని పెంచుతాయి. సైలెంట్ మోడ్‌తో మీరు ఆ ఒత్తిడిని తగ్గించి.. తక్కువ ఆందోళనను పొందుతారు. ఫోన్ చూడకపోతే ఏదో ఇన్‌ఫర్మేషన్ కోల్పోతున్నామనే భావన తక్కువగా ఉంటుంది.చాలా మంది ఇంట్రోవర్ట్స్ లేదా సామాజిక ఇన్‌పుట్‌ను నియంత్రించుకోవాలనుకునేవారు ఇలా చేస్తారు. ఎప్పుడూ ఆన్‌లైన్ కనెక్షన్‌లో ఉండే కంటే లోతైన సంబంధాలు, ఒంటరితనంలో శక్తి పొందడం ఇష్టపడతారు.
సెల్ఫ్ డిసిప్లెన్
ఫోన్‌న సైలెన్స్‌లో పెట్టేవారు ఫోకస్‌ను అరుదైన వనరుగా భావిస్తారు. ప్రతిసారి చెక్ చేయకుండా.. ఎప్పుడు చూడాలో వారే ఎంచుకుంటారు. సందేశాలకు ఆలస్యంగా రిప్లై ఇవ్వడాన్ని సౌకర్యంగా భావిస్తారు. ఇది వారి వ్యక్తిత్వంలో అధిక స్థాయి బాధ్యతాయుతతను చూపిస్తుంది. ఇది భావోద్వేగ భద్రతను సూచిస్తుంది.






