- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతున్నాయా? మీరు తప్పక తినాల్సిన పండ్లు ఇవే..!
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తుప్పుతున్నాయా? మీరు తప్పక తినాల్సిన పండ్లు ఇవే..!

దిశ, ఫీచర్స్ : మధుమేహంతో బాధపడుతున్నారా? రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతున్నాయా? అయితే ఈ సీజన్‌లో మాత్రమే లభించే నేరేడు పండ్లను మీరు తప్పక తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వీటిలో బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయగల పోషకాలు ఫుల్లుగా ఉంటాయి. పైగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్(GI)ను కూడా కలిగి ఉంటాయి. ఇవి గ్లూకోస్ స్థాయిలను నింయంత్రించడంలో సహాయపడతాయి. ఇంకా ఏ విధంగా మేలు చేస్తాయో ఇప్పుడు చూద్దాం.
నేరేడు పండ్ల(Jamun or black plum)లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, అట్లనే అదర్ బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి (Oxidative stress in the body)ని తగ్గిస్తాయి. డయాబెటిస్ (Diabetes) బాధితులకు జామున్(నేరేడు) పండ్లు, వాటి గింజలు మెడిసిన్‌లా పనిచేస్తాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. అందుకు ప్రధాన కారణం వీటిలో జాంబోలిన్, అండ్ జాంబోసిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గ్లూకోస్ జీవక్రియను (Glucose metabolism) నియంత్రిస్తాయి.
జామున్ పండ్ల(black plum)లో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు (Anthocyanins, flavonoids), ఫైబర్, ఇనుము, కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. వీటితోపాటు ఈ పండ్లలోని ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రలైజ్ (Neutralize) చేస్తాయి. కాబట్టి ఇవి మధుమేహం వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్యలను, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు వంటివి తగ్గించడంలో సహాయపడతాయి. నేరేడు పండ్లలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్లూకోజ్ శోషణ(Glucose absorption)ను కూడా నెమ్మదిస్తుంది. కాబట్టి దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు.
నేరేడు పండ్ల గింజలలో ఉండే జాంబోలిన్ అనే ఆల్కలాయిడ్ స్టార్చ్‌ను గ్లూకోజ్‌గా మార్చే ప్రక్రియను నియంత్రిస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ పండ్లలో తక్కువ కేలరీలు, తక్కువ చక్కెరలు ఉండటం వల్ల బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడంలో, శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ లేదా మంటను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అయితే అతిగా తినడంవల్ల రక్తంలో చక్కెరస్థాయిలు చాలా తక్కువ స్థాయికి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి లిమిటెడ్‌గా తినాలి. వైద్య నిపుణుల సలహాల మేరకు నడుచుకోవాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






