- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : అర్ధ రాత్రి దాటినా మేల్కొని ఉంటున్నారా..? మీ శరీరంలో, ప్రవర్తనలో వచ్చే మార్పులివే..
Health : అర్ధ రాత్రి దాటినా మేల్కొని ఉంటున్నారా..? మీ శరీరంలో, ప్రవర్తనలో వచ్చే మార్పులివే..

దిశ, ఫీచర్స్ : అవసరం ఉన్నా.. లేకున్నా అర్ధరాత్రి ఒంటిగంట వరకు మేల్కొని ఉండే అలవాట్లు నగర జీవితాల్లో సాధారణమై పోతున్నాయి. పగలంతా వివిధ పనుల్లో నిమగ్నమై ఉండేవారు సరదాకోసమో, స్క్రీన్లలో నిమగ్నమవుతూనో, పార్టీల్లో, పబ్బుల్లో గడుపుతూనో నిద్రను కావాలని దూరం చేసుకుంటుంటారు. కానీ.. ఇది శరీరంలో, ప్రవర్తనలో ప్రతికూల మార్పులకు దారితీస్తుందని, ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ, అలాగే హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుంచి వచ్చిన ఒక కొత్త అధ్యయనం పేర్కొన్నది. అయితే నైట్ షిఫ్టులు చేసేవారికి మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే వారు ఆ నిద్ర సమయాన్ని పగటివేళలో కవర్ చేస్తారు. ఒకవేళ కవర్ చేయకపోతే మాత్రం వీళ్లల్లో కూడా ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
తాజా పరిశోధన ప్రకారం.. రాత్రి ఒంటిగంట వరకు లేదా అంతకంటే ఎక్కువ సమయం మేల్కొని, ఆ తర్వాత నిద్రపోవడమనేది మానసిక ఆరోగ్య సమస్యలైన డిప్రెషన్ (Depression), ఆందోళన (anxiety) మానసిక అస్థిరత (Mental instability) వంటి రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్యలకు ప్రధాన కారణం మీ బాడీలోని సిర్కాడియన్ రిథమ్.. అంటే శరీరంలోని అంతర్గత జీవగడియారం. ఇది హార్మోన్ స్థాయిల నుంచి భావోద్వేగ నియంత్రణ వరకు అన్నంటినీ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మీ శరీరం అలవాటుకు, అవసరానికి భిన్నంగా సహజమైన నిద్ర సమయాన్ని దాటి, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడంవల్ల మెదడు భావోద్వేగాలను ప్రాసెస్ చేయడంలో, ఆలోచనలను ఫిల్టర్ చేయడంలో విఫలం అవుతుంది.
అర్ధరాత్రి వరకు, ముఖ్యంగా ఒంటిగంట దాటే వరకు మేల్కొని ఉండటమనేది ఆయా వ్యక్తుల శరీరంలో ప్రతికూల మార్పులకు, అసహజమైన ప్రవర్తనలకు దారితీసే పరిస్థితి అందరికీ ఒకే లా వర్తించదని కూడా పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా నైట్ షిఫ్టులు చేసేవారికి ఈ థియరీ వర్తించదు. ఎందుకంటే వారి శరీరం రాత్రిళ్లు మేల్కొని ఉండే అలవాట్లకు అనుగుణంగా సానుకూలంగా స్పందిస్తుంది. కానీ నైట్ షిఫ్టులు చేసే అలవాటు లేనివారు కూడా అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం, ఆ తర్వాత పగలు కూడా సరిగ్గా నిద్రపోకపోవడమనేదే ఇక్కడ అనారోగ్యాలకు, మానసిక రుగ్మతలకు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. పగటివేళలో నిద్రపోకుండా ఉండేవారు లేదా పనుల్లో నిమగ్నమై ఉండేవారు కూడా రాత్రి ఒంటిగంట వరకు మేల్కొని ఉండే అలవాటువల్ల, వీరి మెదడు ఒత్తిడిని నిర్వహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అంతేకాకుండా ప్రతికూల ఆలోచనలు, ఆవేశ పూరిత ప్రవర్తనలు పెరుగుతాయి. ఈ ప్రభావాన్నే ‘మైండ్ ఆఫ్టర్ మిడ్‌నైట్ ఎఫెక్ట్’ అని పిలుస్తున్నారు నిపుణులు.






