- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ తెగల్లో మహిళలదే పెత్తనం.. మాతృస్వామ్యం ఇప్పటికీ జీవించే ఉంది!!
భారత దేశం పితృస్వామ్య లేదా పితృప్రధాన దేశంగా ప్రసిద్ధి చెందింది. అంటే ఇక్కడ స్త్రీ, పురుషులు అన్ని విషయాల్లో సమానం కాదని, పురుషులే గొప్పవారనే భావన, భావజాలమే ఇప్పటికీ ఆధిపత్యం వహిస్తోంది. కానీ..

దిశ, ఫీచర్స్ : ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ప్రాచీన కాలంలో ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేదని నిపుణులు చెబుతుంటారు. అంటే తెగల్లో లేదా కుటుంబాల్లో మహిళలే నిర్ణయాధికారాన్ని కలిగి ఉండేవారు. కుటుంబ పెద్దగా ఆధిపత్యం వహించేవారు. సుమారు 5,000-10,000 సంవత్సరాల క్రితం ఇది కొనసాగిందని చెబుతుంటారు. ఆ తర్వాత పరిణామ క్రమంలో పితృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. దీనినే పరుషాధిక్య సమాజం అని పిలుస్తారు. ప్రస్తుతం పురుషాధిక్య సమాజమే నడుస్తోంది. అంటే కుటుంబాల్లో యజమానులుగా పురుషులే ఉంటారు. కుటుంబంపై ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. వారసత్వ హక్కును, ఆస్తి హక్కును వారే కలిగి ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో నిర్ణయాధికారం వీరిదే. ఇక పురుషులు సంపాదించడం, ఉద్యోగం చేయడం, కుటుంబానికి బాధ్యత వహించడం, ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడం వంటివి చేస్తుంటే.. స్త్రీలు ఇంటి పనులు చేయడం, కుటుంబాన్ని చూసుకోవడం, కుటుంబ సభ్యులకు సేవలు చేయడం, భర్తపట్ల, కుటుంబ సభ్యులపట్ల విధేయతను కలిగి ఉండటం వంటివి పురుషాధిక్య సమాజపు లక్షణాలుగా చెప్పవచ్చు. కాగా మహిళలు నిర్ణయాధికారాన్ని కలిగి ఉండే నాటి మాతృస్వామ్య వ్యవస్థ ఇప్పుడు లేదు. కానీ అరుదుగా కొన్ని తెగల్లో మాత్రం ఇది కొనసాగుతోంది. అవేమిటో చూద్దాం.
భారత దేశం పితృస్వామ్య లేదా పితృప్రధాన దేశంగా ప్రసిద్ధి చెందింది. అంటే ఇక్కడ స్త్రీ, పురుషులు అన్ని విషయాల్లో సమానం కాదని, పురుషులే గొప్పవారనే భావన, భావజాలమే ఇప్పటికీ ఆధిపత్యం వహిస్తోంది. అయినప్పటికీ అరుదుగా కొన్ని తెగలు లేదా సమూహాల్లో మాత్రం ఒకప్పటి మాతృస్వామ్య లేదా మాతృ ప్రధాన (Matrilineal) సంప్రదాయాలను అనుసరిస్తున్నాయి. ఆస్తిని వారసత్వంగా పొందుతున్నాయి. కుటుంబాలను నడిపిస్తున్నాయి. వంశపారంపర్యాన్ని తల్లి ద్వారా కొనసాగిస్తున్నాయి. ఈ సంప్రదాయాలు ఈశాన్య భారతదేశం నుంచి దక్షిణపశ్చిమ ప్రాంతాల వరకు వ్యాపించి ఉన్నాయి. ఇవి సాధారణంగా భారతీయ సమాజంలో ఆధిపత్యం చెలాయించే పితృప్రధాన నియమాలను సవాలు చేస్తాయి. ఉదాహరణకు మేఘాలయ, కేరళ, కర్ణాటకలోని కొన్ని తెగలు మహిళలే కుటుంబంపై ఆధిపత్యం కలిగి ఉండే వ్యవస్థను ఇప్పటికీ పాటిస్తున్నాయి. ఇక్కడ మహిళలే కుటుంబ ఆస్తికి, నాయకత్వానికి కేంద్రబిందువుగా ఉంటున్నారు.
ఖాసి, గారో తెగలు, మేఘాలయ
ఈశాన్య భారతదేశంలోని మేఘాలయలో నివాసముండే ఖాసి, అలాగే గారో తెగల ప్రజలు ఇప్పటికీ మాతృప్రధాన సమాజానికి ప్రముఖ ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఖాసి సమాజంలో పిల్లలకు తల్లి ఇంటి పేరును వారసత్వంగా తీసుకుంటారు. ఇక పెళ్లి తర్వాత ఇక్కడ భర్తలే భార్య ఇంటికి వస్తారు. ఇక ఈ తెగ కటుంబంలోని చిన్న కుమార్తె (Nokme-chick) పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందుతుంది. ఇక్కడ మహిళలు మాత్రమే కుటుంబ నిర్ణయాలలో ప్రధాన పాత్ర పోషిస్తారు. పురుషులపై ఆధిపత్యం చెలాయిస్తారు. పురుషులు ఆస్తి లేదా వంశానికి సంబంధించిన హక్కులు కలిగి ఉండరు. మొత్తానికి ఇక్కడ ఆస్తి, వంశం తల్లి ద్వారా కొనసాగుతాయి. అంటే కుటుంబం ద్వారా వచ్చే ఆస్తికి, ఇతర విషయాల్లోనూ ఆ కుటుంబంలోని మహిళే వారసురాలవుతుంది తప్ప పురుషుడు కాడు. వంశం పారంపర్యం తల్లి ద్వారా వస్తుందని భావిస్తారు తప్ప తండ్రి ద్వారా అని ఎవరూ అనుకోరు. పైగా ఈ తెగలు లేదా సమాజాలు మహిళల సాధికారతను చూపిస్తూ, సాంప్రదాయ లింగ భేదాలను తిరస్కరిస్తాయి.
నాయర్, ఎజావా కేరళలోని
దక్షిణ భారతదేశంలో కేరళలోని నాయర్, అలాగే ఎజావా సమాజాలు మాతృప్రధాన వ్యవస్థకు చారిత్రక ఉదాహరణలు. ఈ సమాజాలలో కుటుంబ సంబంధాలు తల్లి ద్వారా గుర్తించబడతాయి. ఆస్తి మహిళలకు వారసత్వంగా వస్తుంది. చారిత్రకంగా నాయర్ కుటుంబాలలో పురుషులు భార్య ఇంటికి వెళ్లి నివసిస్తారు. మహిళలు కుటుంబ ఆస్తిని కాపాడటం, మేనేజ్ చేయడం చేస్తారు. కుటుంబ నిర్ణయాల్లో పెత్తనం వీరిదే. కుటుంబ పెద్దగా ఆ కుటుంబంలోని మహిళే ఉంటుంది. కర్ణాటకలోని బంట్ అండ్ బిల్లవ తెగలు కూడా ఇలాంటి సంప్రదాయాలను కలిగి ఉన్నాయి. ఇక్కడ వంశం, ఆస్తి తల్లి ద్వారా కొనసాగుతాయి. ఆధునిక కాలంలో ఈ సంప్రదాయాలు కొంత మార్పులకు గురవుతున్నప్పటికీ, అవి భారతీయ సమాజంలో మహిళల పాత్రను పునర్నిర్వచిస్తాయని, సమానత్వాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు, చరిత్రకారులు అంటున్నారు.






